ఇప్పుడు ఎక్కడ చూసినా మాఫియా అనేది సర్వసాధారనం అయ్యింది.హవాలా మాఫియా,ఇసుకమాఫియా,భూమాఫియా ఇవన్నీ విన్నాం.ఈ మాఫియా చేసేదంతా మనుషులే.ఈ మాఫియా మనుషులకే కాదండోయ్ జంతువులుకూడా ఈ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాయి.కోతులు ఏంటి మాఫియా ఏంటి అనుకుంటున్నారా మీరు వింటున్నది నిజమే.
అక్కడ కోతులే గ్రూపులుగా మారి పెద్ద మాఫియాను నడుపుతున్నాయి. భక్తులల దగ్గరున్నవి లాక్కొని వాటికి కావాల్సిన ఆహారాన్ని దర్జాగా సంపాదించుకొని బ్రతికేస్తున్నాయి. ఇదంతా ఇండోనేషియాలోని ఓ ఆలయంలో ఈమాఫియాను నడిపిస్తున్నాయి వానరాలు. ఆలయానికి వచ్చే యాత్రికుల నుంచి గ్లాసులు, టోపీలు, కెమెరాలు, నగదు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకుపోతున్న కోతులు తమకు కావాల్సిన ఆహార పదార్థాల కోసం వాటిని బేరానికి పెడుతున్నాయి. బాధితులు తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి రాబట్టుకోవాలంటే కోతులతో బేరమాడక తప్పటం లేదు. ఈ బేరం గనక వాటికి నచ్చితే ఆహార పదార్థాలను తీసుకుని, అందుకు బదులుగా తమ వద్ద ఉన్న వస్తువులను తిరిగి ఇచ్చేస్తున్నాయి.
{loadmodule mod_custom,GA2}
ఈ రకమైన మాఫియాను అక్కడి కోతుల గుంపు కొంతకాలంగా దిగ్విజయంగా దర్జాగా నడిపిస్తున్నాయి. ఈ వింత ఇండోనేసియా బాలి దీవిలోని ఉలువాతు ఆలయ పరిసరాల్లో జరుగుతోందని బెల్జియంలోని లీజ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు ఫేనీ బ్రొట్‌కార్న్‌తేల్చారు. ఉలువాతు ఆలయ పరిసరాల్లో ఉండే నాలుగు కోతుల గుంపు చేస్తున్న చేష్టలను ఫేజీ బ్రొట్‌కార్న్ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం నాలుగు నెలల పాటు అధ్యయనం చేసి ..అక్కడి కోతులకు మాత్రమే ఉన్న ప్రత్యేక అలవాటుగా పరిశోధకులు చెబుతున్నారు.
వస్తుమార్పిడి, వ్యాపార మెళకువలు మానవులకు మాత్రమే ప్రత్యేకమైన నైపుణ్యాలు. కాగా కోతులు కూడా ఇటువంటి మెలకువలు అలవాటు చేసుకోవటంపై మరింత పరిశోధన సాగిస్తే ఆది మానవుల గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.చూశారుగా మంకీ మాఫియా.
{loadmodule mod_sp_social,Follow Us}