Saturday, May 3, 2025
- Advertisement -

మెగా బ్రదర్‌ చూపు..కాకినాడ వైపు!

- Advertisement -

టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఎవరెవరు ఎన్ని స్థానాల నుండి పోటీ చేస్తారు అన్న దానిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అయితే టీడీపీ సంగతి పక్కన పెడితే ప్రధానంగా పవన్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేసే స్థానాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో పవన్..గాజువాక, భీమవరం నుండి పోటీ చేస్తే నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి ఎంపీగా గెలవగా టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో ఈసారి మెగా బ్రదర్ నాగబాబు ఎక్కడి పోటీ చేస్తారోనని జనసైనికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక ఎంపీగా బరిలోకి దిగుతారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం నాగబాబు ఈసారి కాకినాడ ఎంపీ స్థానం నుండి బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నారట.

దీనిపై పార్టీలో ఇప్పటికే ఓ నిర్ణయానికి రాగా టీడీపీ చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండటమే కారణమని తెలుస్తోంది.ఈసారి టీడీపీతో కలిసి జట్టు కడుతుండటంతో గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారట నాగబాబు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -