తెలుగు నాట జబర్ధస్త్ గురించి తెలియని టీవీ ప్రేక్షకులు ఉండరేమో. ఆ జబర్ధస్త్‌లో ఆర్పీ అనే టీం లీడర్ ఉంటాడు. ఆ టీం లీడర్‌కి మన టీడిపి లీడర్ చంద్రబాబు నాయుడికి ఉన్న గొప్ప సారూప్యం ఏంటో తెలుసా? ఆర్పీని మించిన కామెడీని చంద్రబాబు చేయగలడన్న విషయం తెలుసా? ఒక జడ్జ్‌గా రోజా జడ్జ్‌మెంట్ ఏంటి?
జబర్ధస్త్ ఆర్పీ స్కిట్స్‌లో ఒక కాన్సెప్ట్ మాత్రం భలే పాపులరైంది. అదేంటంటే ఆర్పీ సెలూన్ పెట్టినా, సెల్ ఫోన్ షాప్ పెట్టినా ………ఆఖరికి పబ్లిక్ టాయిలెట్ పెట్టుకున్నా…….దాని గురించి ఆర్పీ చెప్పి స్టైల్ మన చంద్రబాబుకు లాగే ఉంటుంది. ఏం చేసినా సరే……..‘ఇది ప్రపంచంలోనే నంబర్ ఒన్, ప్రపంచంలోనే అత్యుత్తమం’ అంటూ చెప్పుకోవడం ఆర్పీ స్టైల్. మూడున్నరేళ్ళుగా చంద్రబాబు తీరు కూడా అలానే ఉంటోంది.
ఫైబర్ నెట్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ ప్రపంచంలోనే ఆంద్రప్రదేశ్ అగ్రగామిగా దూసుకుపోవాలన్నాడు చంద్రబాబు. ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఇండియా స్థానం ఎంత? ఆ విషయంలో టాప్‌లో ఉన్న దేశాలకంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం అన్న కనీస నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే……. చంద్రబాబు చెప్పింది జబర్ధస్త్ జోక్ అనుకుని పగలబడి నవ్వడం ఖాయం.
ఇక ఈ మధ్యనే టూరిజంకు సంబంధించి ఏదో ప్రోగ్రాంలో పాల్గొన్న చంద్రబాబు……ప్రపంచంలోనే నంబర్ ఒన్ టూరిజం స్పాట్‌గా ఆంద్రప్రదేశ్‌ని నిలుపుతానన్నాడు. ప్రపంచంలో కేవలం టూరిజం ఆదాయంతోనే టాప్ రేంజ్‌లో దూసుకెళ్తున్న దేశాలు ఉన్నాయని చంద్రబాబుకు తెలుసా? ఆయా దేశాలతో పోల్చుకుంటే ఇండియా స్థానం ఎంత? అసలు ప్రపంచానికే టూరిజం హబ్‌గా ఆంద్రప్రదేశ్ ఎలా అవుతుంది? టూరిజం అనేది కేవలం బిల్డింగ్‌లతో పెరిగేదా? ఆయా దేశాల్లో నేచురల్‌గా ఉన్న అద్భుతాలనే ప్రజలు ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారన్న విషయం చంద్రబాబుకు తెలియదా? అంతెందుకు కాశ్మీర్ అందాలను అమరావతికి తీసుకురాగలడా చంద్రబాబూ?
ఇక పోలవరంతో సహా అన్ని విషయాల్లోనూ బాబుది సేం డైలాగ్. ‘ఇది ప్రపంచంలోనే…….’ అంటూ ఆర్పీ స్టైల్‌లోనే పిచ్చ కామెడీ చేస్తూ ఉంటాడు. బాబుది కామెడీ కాదు అని అనుకునే స్థాయి తక్కువ నాలెడ్జ్ లెవెల్స్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు…….వాళ్ళు నమ్ముతారన్న నమ్మకమేమో మరి. కాకపోతే ప్రపంచదేశాలన్నీ తిరుగుతూ పేద రాష్ట్రాన్ని కాస్తా దివాళా రాష్ట్రంగా మార్చే స్థాయిలో ఖర్చుపెట్టేస్తున్న బాబుకి ప్రపంచ దేశాలపైన కనీస స్థాయి అవగాహన లేకపోవడం మాత్రం ఆలోచనాపరులను విస్తుపోయేలా చేస్తోంది.
ఇక ఆశావహ దృక్పథం ఉంటే తప్పేంటి అనే పచ్చ బ్యాచ్ జనాలకు కూడా ఒక విషయం చెప్పాలి. డిగ్రీ చేసినోడు ఐఏఎస్ సాధిస్తానంటే ఆశావహ దృక్పథం అంటారు. అదే ఏ సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయినోడో…..అసలు అక్షరమ్ముక్కలే రానోడో ఐఏఎస్ అవుతానంటే జాలిపడడం తప్ప ఏమీ చేయలేం. టూరిజం విషయంలో ఇండియాదే ఇల్లిటరేట్ స్థాయి. ఇక ఆంద్రప్రదేశ్ స్థాయి ఏంటో చెప్పవసరం లేదుగా?
హైటెక్ సిటీ, సాఫ్ట్ వేర్‌లో బాబు దిట్ట అనే వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే సాఫ్ట్ వేర్ ఎగుమతులు బాబు కంటే వైఎస్ కాలంలోనే ఘననీయంగా పెరిగాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఆ ఫలితాలు చంద్రబాబు వేసిన పునాదులు వేసిన ఫలితం అంటే శ్రీసిటీ, విజయవాడలో సాఫ్ట్ వేర్ బిల్డింగ్స్, పట్టిసీమ కాల్వలు అన్నీ కూడా వైఎస్ జమానావే. సీమాంధ్రలో సాఫ్ట్ వేర్ డెవలప్ అవడానికి పునాదులు వేసింది వైఎస్సే. ఆ విషయం ఒప్పుకుంటారా? అయినా బాబు హయాంలో సాఫ్ట్ వేర్‌లో కూడా రాష్ట్రం ప్రపంచంలోనే నంబర్ ఒన్ కాలేదు. కనీసం ఇండియాలో కూడా కాలేదు. బెంగుళూరుతో పోటీ పడేస్థాయిలో కూడా లేదు.
అసలు విషయం ఏంటంటే 2014లో జనాలకు గంపెడాశాలు చూపించి గద్దెనెక్కాడు చంద్రబాబు. ఇక ఆ ఆశలను కంటిన్యూ చేయడం కోసం….ఈ ప్రపంచంలోనే అనే డైలాగ్‌ని అంది పుచ్చుకున్నాడు. దానికి తోడు గ్రాఫిక్స్ బొమ్మలు. అంతకుమించి చేతల్లో బాబు చేస్తున్నది ఎంత అంటే ఈ మూడు రోజలుగా ఆంద్రజ్యోతిలో కేంద్రాన్ని తిడుతూ వస్తున్న వార్తలు చదవండి. అందులో అర్థమయ్యే విషయం ఒకటే. ఆంద్రప్రదేశ్‌కి అసలు ఏమీ రాలేదని. కాకపోతే ఆ పాపాన్ని మోడీపై రుద్దడానికి మాత్రం పచ్చబ్యాచ్ రెడీగా ఉంది. మరి నాదీ-మోడీది అభివృద్ధి జోడి అన్న చంద్రబాబు మూడున్నరేళ్ళుగా ఎమీ చేయకుండా మాటలు, గ్రాఫిక్స్ బొమ్మలతో ఎందుకు కాలం వెళ్ళదీసినట్టు?
ఇక జబర్ధస్త్ ఆర్పీ కామెడీ బెటరా? చంద్రబాబు జబర్ధస్త్ కామెడీ బెటరా అంటే మాత్రం సమాధానం రోజానే చెప్పాలి.