తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన గొప్ప సినిమాలతో పోల్చవద్దు. మరుగుదొడ్ల విషయంలో కూడా ప్రపంచ ఖ్యాతి అంటూ ప్రతి విషయంలోనూ ప్రపంచ స్థాయి క్వాలిటీ అని డాబు చేసే బాబుగారు చెప్పినట్టుగా ప్రపంచ స్థాయి గొప్ప సినిమాలతో అసలే పోలిక వద్దు. కనీసం పోటీగా నిలిచిన మనం సినిమా ముందు అయినా లెజెండ్ నిలబడుతుందా?
సినిమా అంతా కూడా హింస, రక్తపాతాలే. కొరుకుడు పడని నరుకుడు వ్యవహారాలే. ఇక మనవరాలి వయసు ఉన్న అమ్మాయిలతో బాలయ్య సరసాలు, సాంగులు, డ్యాన్సులు….అబ్బో అరాచకం అంతే. కనీసం సింహా సినిమాలా ప్రేక్షకాదరణ పోందిన సినిమా కూడా కాదు. ఏడు కోట్లు నష్టం తెచ్చిపెట్టిన సినిమా. టీవీ తెరపైన కూడా కనీస స్థాయి రేటింగ్స్ తెచ్చుకోలేకపోయిన సినిమా. మేకింగ్ క్వాలిటీస్ కూడా ఎప్పుడో తొంభైల నాటి నరుకుడు సినిమాల స్థాయిలో ఉంటుంది. అయితేనేం ‘కమ్మ’ని వాడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు బంధువు అయిన నేపథ్యం పనిచేసింది. పుష్కరాల సమయంలో బాబుగారిని కూడా సింహా స్థాయిలో ప్రజెంట్ చేయాలని చూసిన బోయపాటి శ్రీనుకు కూడా అవార్డ్ వచ్చింది. పుష్కర ప్రమాదాల్లో ముప్ఫై మంది చనిపోతేనేం? వ్రతం చెడితేనేం? బోయపాటికి ఫలం నంది రూపంలో దక్కింది.
నంది అవార్డుల విషయంలో లెజెండ్‌తో పోటీ పడిన సినిమా మనం. బాలకృష్ణ సమ వయస్కుడైన నాగార్జున తన వయసుని గుర్తించి హుందాగా ఉండే పాత్రలో మెప్పించిన సినిమా. హృద్యమైన కథ, కథనాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింకున్న సినిమా. ఎక్కడా అసభ్యత, అశ్లీలతకు తావు లేకుండా వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతల గురించి చెెప్పిన సినిమా. క్వాలిటీ పరంగా చూసుకుంటే ‘మనం’ సినిమా ముందు కనీస స్థాయిలో కూడా నిలబడలేడు నరుకుడు లెజెండ్. అయితేనేం మనం సినిమా కంటే లెజెండ్ సినిమానే ‘కమ్మ’గా కనిపించింది పాలకులకు.
అంతా బాగానే ఉంది. ఎన్నో తప్పులను సమర్థించుంటున్నట్టుగానే ఈ తప్పును కూడా పచ్చ మీడియా ప్రాపగండాతో మేనేజ్ చేయగలడు చంద్రబాబు. ఆల్రెడీ సోషల్ మీడియాలో లెజెండ్‌కి అవార్డుల పంట గురించి ఉతికి ఆరేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నంది అవార్డ్స్ ఫంక్షన్‌కి అన్ని భాషల సినిమా వాళ్ళను, మీడియా వాళ్ళను ఆహ్వానిస్తారు. వాళ్ళందరి సమక్షంలో ఉత్తమ చిత్రం లెజెండ్ గురించి, ఆ సినిమాలో బాలయ్యబాబు నరకుడు యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? లెజెండే తెలుగు సినిమా అత్యున్నత చిత్రం అని చెప్తారా? అలా చెప్పడం తెలుగు సినిమా ఖ్యాతిని చంపెయ్యడం కాదా? ఎన్నికలప్పుడు పెద్ద మాదిగ, పెద్ద కాపు, పెద్ద బిసి లాంటి ఎన్నో కహానీలు చెప్పారు కానీ నంది అవార్డుల సాక్షిగా చంద్రబాబు ‘కమ్మ’ని ఎంపికలు అందరికీ తెలిసిపోతూనే ఉన్నాయి. ఆలోచనాపరులు ఆవేధన చెందేలా చేస్తున్నాయి. రాజకీయ రంగంలో ఎలా ఉన్నా మిగతా రంగాలలో అయినా కాస్త ప్రతిభకు చోటు దక్కి ఉంటే బాగుండేది అన్నదే మేధావుల ఆవేధన. పాలకులు వినిపించుకుంటారా?