Saturday, May 10, 2025
- Advertisement -

షాకింగ్ః సిఎం పదవి కోసం నేరస్థులకూ టికెట్స్ ఇచ్చానని ఒప్పుకున్న చంద్రబాబు

- Advertisement -

యస్………..స్వయంగా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలే……….నేరస్థులకూ టికెట్స్ ఇచ్చి గెలిపించాను. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పాలిటిక్స్ చంద్రబాబు జీవితంలో అధికారం కోసం చేసిన రాజకీయాల గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. అయితే ఆయన నోటి నుంచే వాస్తవాలు వస్తుంటే మాత్రం ఆశ్ఛర్యపోవాల్సిందే. పిల్లనిచ్చిన మామ అన్న కృతజ్ఙత అసలే లేదు. 1983 ఎన్నికలకు ముందు ‘ఎన్టీఆర్‌పైనే పోటీ చేసి గెలుస్తా’ అని ప్రగల్భాలు పలికి కనీసం ఎన్టీఆర్ నిలబెట్టిన ఒక కొత్త అభ్యర్థిపైన కూడా గెలవలేక దారుణంగా ఓడిపోయినప్పటికీ అల్లుడే కదా అని చేరదీసిన ఎన్టీఆర్‌పై కనీసం అభిమానం లేదు. కుర్చీ కోసం తెలుగువారి అభిమాన నటుడు, సినిమా ఇండస్ట్రీలోనూ, రాజకీయాల్లోనూ ఎన్నో శిఖరాలను అధిరోహించిన ఎన్టీఆర్‌కి జీవితంలో అతిపెద్ద పతనం చూపించాడు చంద్రబాబు. ఆ బాధతో ఎన్టీఆర్ చనిపోతే తెలుగు దేశం పార్టీని కాపాడుతున్నాను కదా అని చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్‌ని సమర్థించుకుంటాడు.

ఇక ఎన్నికల్లో డబ్బులు పంపకం, సీట్లు డబ్బులకు అమ్ముకోవడం, బడా వ్యాపారస్థులకు రాజ్యసభ టికెట్స్ ఇస్తూ కోట్లాది రూపాయలు చేతులు మార్చడం లాంటి ఎన్నో రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఇక నాడు హైటెక్ సిటీ అయినా, నేడు అమరావతి అయినా వేల కోట్ల స్కాం, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో బాబు నైపుణ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని స్వయంగా టిడిపి నాయకులే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలాంటి చంద్రబాబు నేరస్థులకు కూడా టికెట్స్ ఇచ్చి గెలిపించాను. అలాంటి వారు ఇప్పుడు వైకాపాలోకి వెళ్తున్నారు అని వాపోతున్నాడు. ఇక్కడ కూడా మంచివారు టిడిపిలో ఉన్నారు అని చంద్రబాబు సమర్థించుకుంటున్నాడు కానీ చింతమనేని ప్రభాకర్‌తో సహా టిడిపిలో ఉన్న చాలామంది నాయకులు ఏంటో తెలుగు ప్రజలకు తెలియదా? గుంటూరులో బాంబుల కల్చర్‌ని పెంచి పోషించిన నాయకుడు ఎవరో ఎవరికి తెలియదు.

కాకపోతే సిఎం కుర్చీ కోసం, అధికారం కోసం నేరస్థులకూ టికెట్స్ ఇచ్చాను అని బాబు చెప్పే మాటలను కూడా పచ్చ మీడియా బ్రహ్మాండంగా సమర్థించగలదు. అప్పటి పరిస్థితుల్లో ఉన్న అపోజిషన్ పార్టీ నాయకుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుంది కాబట్టే చంద్రబాబు అధికారంలోకి రావడం ప్రజలకు ప్రాణాలకంటే ఎక్కువ అవసరం కాబట్టే బాబు అలా చేశాడని చెప్తారు. కానీ ఇప్పటి వరకూ చరిత్ర చూసుకుంటే న్యాయవ్యవస్థతో సహా శాసనవ్యవస్థతో పాటు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసింది చంద్రబాబే అని స్వయంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. ఇక వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ్ లాంటి వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిరైతును అప్పుల పాలు చేసిన ఘనత బాబుదేనని చెప్తారు. అప్పులు తేవడం, ప్రచారానికి, పర్యటనలకు, ఆడంబరాలకు ఖర్చుచేసి మాయ చేయడం మినహా ఆర్థిక వ్యవహారాల్లో చంద్రబాబుకు కనీస పరిజ్ఙానం లేదని ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ బాబు గ్రేట్……..బాబే మళ్ళీ రావాలి అని మాత్రం జనాలను నమ్మించడానికి పచ్చ పార్టీ జనాలందరూ వీర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలంగాణా ప్రజలు చూపించిన విజ్ఙతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూపిస్తారా? లేక మరోసారి ప్రచార మాయలకు పడిపోతారా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -