దివంగత నేత వైస్ రాజశేఖర రెడ్డి అనగానే గుర్తొచ్చేది తెల్లని పంచెకట్టు..చెరగని దరహాసం. ఇవి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆయన కాలంలో తెలుగు సాంప్రదాయానికి దేశవ్యాప్తంగా ఓ ఐకాన్‌లా మారారు వైఎస్ఆర్. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య ఎప్పుడు బయటకొచ్చినా పంచెకట్టుతో కనిపిస్తున్నారు పవన్.
వైఎస్ఆర్ పంచెకట్టుకు ఓ చరిత్రే ఉందని చెప్పుకోవచ్చు. ఒకప్పటి దూకుడు స్వభావం, ముక్కుసూటితనం, ఒక్కసారి అనుకుంటే ఎవరు అడ్డు వచ్చినా.. ఎవరేం చెప్పినా వినకండా ముందుకు దూకే స్వభావం నుంచి పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ అయిన వైఎస్ఆర్‌ను చూశామంటారు అప్పటి నేతలు. ఆ మారిన మనిషికి గుర్తు పంచెకట్టులో కనిపించే వైఎస్ఆర్ అంటారు. దుందుడుకు స్వభావం నుంచి శాంత స్వరూపంగా.. మోముపై చెదరని చిరునవ్వుతో ఎప్పుడూ పంచెకట్టులో కనిపించేవారు వైఎస్ఆర్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా గత కొన్ని రోజులుగా పంచెకట్టులో కనిపిస్తున్నారు. ఏ కార్యక్రమానికి హాజరైనా, ఏ బహిరంగ సభకు హాజరైన పంచెకట్టులో కనిపిస్తున్నారు. ఈ పంచెకట్టు ఓ పెద్ద సెన్సేషన్‌ను సృష్టించిందనే చెప్పుకోవాలి. తెలుగు సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే నేతగా పవన్‌ను జనసేన ప్రమోట్ చేస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా తన మార్పుకు సంకేతంగా పంచెకట్టు కడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దుందుడుకు స్వభావం తనలో తగ్గిందని చెప్పకనే చెబుతున్నారా? యాత్ర సినిమా ప్రభావం పవన్‌పై పడిందా? లేక జస్ట్ అట్రాక్షన్ కోసం పవన్ ఈ పంచెకట్టును ఎంచుకున్నారా? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరితంగా నడుస్తోంది.