Friday, March 29, 2024
- Advertisement -

ప్రభాస్ వదిలుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి అయింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు 21 మాత్రమే. ప్రస్తుతం ప్రభాస్ 22 వ సినిమా రాధే శ్యామ్ రిలీజ్ కి సిద్దం అవుతుంది. తరువాత ప్రభాస్ సలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు 10 వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ ఉనాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఒక్కడు : ఈ సినిమా కథను గుణశేఖర్ ముందుగా ప్రభాస్, కృష్ణంరాజు లను వినిపించారట. అయితే కథ విషయంలో కాస్త ఆలోచించి రిజక్ట్ చేశారట.

సింహాద్రి : రాజమౌళి సింహాద్రి కథను ముందు ప్రభాస్ కే చెప్పాడట. కానీ అనుకోని కారణాలవల్ల ప్రభాస్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు.

ఆర్య : ఆర్య సినిమా కోసం మొదట ప్రభాస్ ని దిల్ రాజు సంప్రదించారట. కాకపోతే అప్పటికే ప్రభాస్ మరో సినిమాలో బిజీగా ఉండటంతో ఆర్య సినిమాని రిజెక్ట్ చేశాడు.

దిల్ : దిల్ సినిమాకు ముందు ప్రభాస్ నే అనుకున్నారట. కానీ ప్రభాస్ మరో సినిమాతో బిజీగా ఉండటం వల్ల దిల్ ను వదిలేశాడు.

నాయక్ : ప్రభాస్ కోసం నాయక్ సినిమా కథ ను సిద్దం చేశాడట వినాయక్. కానీ రెబల్, మిర్చి సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని ప్రభాస్ వదిలేశాడు.

కిక్ : ఈ సినిమా కథని మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. అప్పటికి రవితేజ పిచ్చ ఫామ్లో ఉండడంతో సూరి రవితేజ ను ఫైనల్ చేసుకున్నాడట.

బృందావనం : బృందావనం కథని ప్రభాస్ వినిపిస్తే అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకి కమిట్ అవ్వడంతో.. ప్రభాస్ ఈ సినిమాని వదిలేసాడట.

డాన్ శీను : ఈ కథను ప్రభాస్ కి చెప్పాడట గోపిచంద్ మలినేని. బుజ్జిగాడు సినిమాతో ఈ సినిమాలోని కార్యెక్టర్ ని పోల్చుకున్న ప్రభాస్.. వద్దని చెప్పాడట.

ఊసరవెల్లి : ఈ కథ కూడా ప్రభాస్ రిజెక్ట్ చేసిందేనట.

జిల్ : జిల్ కథను ముందు ప్రభాస్ కి వినిపించాడట డైరెక్టర్. కానీ ప్రభాస్ బాహుబలితో బిజీగా ఉండటం వల్ల కుదరలేదట. దాంతో ఈ సినిమాని గోపిచంద్ తో తీశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -