Saturday, April 20, 2024
- Advertisement -

ఎట్టకేలకు బొమ్మ పడింది.. థియేటర్లలో ప్రేక్షకుల సందడి..!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎట్టకేలకు థియేటర్లు తెరుచుకున్నాయి. మార్నింగ్ షో వేశారు. ఇవాళ సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరసు, తేజ సజ్జ హీరోగా నటించిన ఇష్క్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలతో పాటు మరో రెండు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి చూపారు.

సినిమా హళ్ళు ప్రారంభం కావడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కొన్ని నెలలుగా థియేటర్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్ల యాజమాన్యాలు భారీగా నష్టపోయాయి. థియేటర్లను ఓపెన్ చేయాలని కొన్ని రోజులుగా సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వాలను కోరుతూ వచ్చాయి. లాక్ డౌన్ ఎత్తివేయడం, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని థియేటర్ లో ఓపెన్ చేసేందుకు తెలంగాణ,ఏపీ ప్రభుత్వాలు అనుమతించాయి.

తెలంగాణ ప్రభుత్వం 100% ఆక్యుపెన్సీ తో ప్రేక్షకులను అనుమతించగా, ఏపీ ప్రభుత్వం మాత్రం 50% ఆక్యుపెన్సీ తో థియేటర్లు తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కొన్ని నెలలపాటు థియేటర్లను మూసివేయడంతో తమకు చాలా నష్టం వచ్చిందని ప్రభుత్వాలు తగిన సాయం చేయాలని థియేటర్ల యాజమాన్యాలు కోరుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఉపాధి కరువైందని ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో తమ కష్టాలు గట్టెక్కుతాయని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ప్రభాస్ వదిలుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

నంబర్ వన్ హీరోల పొంగల్ ఫైట్.. ఇక రచ్చ రచ్చే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -