మన ఇండియాలో అత్యంత ఖరీదైన హోటల్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒక్క రోజు స్టే చెయ్యాలంటే అక్షరాలా ఆరు లక్షలు పట్టుకోవాల్సిందే. ఆరు లక్షలు ఖర్చు పెట్టి ఉండే ఆ హోటల్స్ లో వసతులు కూడా అదే విధంగా ఉంటాయి. మరి ఆ హోటల్స్ గురించి తెలుసుకుందామా.
మొదటిది.. ముంబై లోని ది తాజ్ మహల్ పాలస్ అండ్ టవర్స్. ఇందులో లగ్జరీ రూమ్ ఖరీదు.. రూ.1.70 లక్షల రూపాయలు. ఇది కేవలం రూమ్ రెంట్ మాత్రమే. ఫుడ్ వంటి వాటికి ఎక్స్ ట్రా చెల్లించాల్సిందే. రెండవది ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్… ఇందులో రూమ్ రెంట్ రెండు లక్షలు. హైదారాబాద్ లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్, ముంబై లోని తాజ్ లాండ్స్, ఒబెరాయ్ హోటల్, ఆగ్రాలోని ఒబెరాయ్ అమర విలాస్, గుర్గావ్ లోని ది ఒబెరాయ్, న్యూ ఢిల్లీలోని ది లీలా పాలస్, జైపూర్ లోని ఒబెరాయ్ రాజ్ విలాస్ హోటల్స్ లో రూమ్ రెంట్ దాదాపు రెండు లక్షలు వరకు ఉంటుంది. ఇక వీటన్నింటికంటే ఖరీదైన హోటల్ ఉదయపూర్ లోని తాజ్ లేక్ పాలస్. ఉదయపూర్ లో ఒక సరస్సు మధ్యలో ఈ హోటల్ నిర్మించారు. సరస్సు మధ్యలో వుండటంచే ఎంతో చల్లగా వుండి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ హోటల్ లోని రూమ్ రెంట్ మాగ్జిమమ్ 6 లక్షల రూపాయాల వరకు కలదు.