Sunday, May 4, 2025
- Advertisement -

వీధి పోరాటం…..ముంబాయిలో అంతే….

- Advertisement -

మనం సినిమాల్లో మాత్రమే ఒళ్ళు గగుర్పొడిచే ఫీట్లను చూస్తుంటాం. అదే ఫీట్లు మన కళ్లముందు నడి రోడ్డు మీద కనపడితే…. ఒక్క క్షణం మన గుండె ఆగినట్లవుతోంది. ఆగస్ట్ 12న ముంబయ్ లో అదే జరిగింది.

సీసీ టీవీ లో రికార్డయిన ఆ దృశ్యాలు ప్రస్తుతం న్యూస్ చానళ్ళలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓ కారు డ్రైవర్ అతడి కారుపై మరో వ్యక్తి వేలాడుతున్నా … ఏమాత్రం ఆపకుండా దయ లేకుండా  దాదాపు 300 మీటర్లు నడిపాడు. చివరికి పోలీసుల చేతికి అతను చిక్కి అరెస్టయ్యాడు.

మ్యాటర్లోకి ఎంటరైనట్లయితే….

ముంబయ్ లో ఓ ట్యాక్సీ  డ్రైవర్ కు ఓ బస్సుడ్రైవర్ కు గొడవజరిగింది. కారు డ్రైవర్ బస్సుడ్రైవర్ పై చేయిచేసుకొని అక్కడినుంచే ఉడాయించే ప్రయత్నం చేశాడు. అసలే పౌరుషానికి మారుపేరైన ఆ బస్ డ్రైవర్ ఊరుకుంటాడా చెప్పండి….అతను  ఏకంగా ఆ కారు ముందు భాగంపైకి దూకాడు.  అతడు కారు వేగంతో ముందుకు పోనివ్వడంతో బస్సు డ్రైవర్ కిందపడకుండా కారు వైపర్ ను పట్టుకుని వేలాడుతూ అలాగూ కూర్చున్నాడు. ఈ దృశ్యం చూస్తున్నవారందరికీ నోట మాటరాలేదు. చివరకు కారు 300 మీటర్ల వరకు దూసుకెళ్లి ఆగడం,కారు నడిపిన ఆ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసి ఉతికి ఇస్త్రీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఎలాగైతేనేం బస్సు డ్రైవర్ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు.

{youtube}9TIUEEibREY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -