Monday, April 29, 2024
- Advertisement -

సలీమ్‌ ఏడుగురు ప్రాణాలను కాపాడలేకపోవచ్చుకాని..50 మంది ప్రాణాలను కాపాడారు..

- Advertisement -

అమర్ నాథ్ యాత్ర ముగించుకుని వైష్ణోదేవి యాత్రకు బయల్దేరిన బస్సుపై లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పంజా విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది గాయపడ్డారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్ర‌యాణికులు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను వెల్ల‌డించారు.

మేం బస్సులో ఉన్నాం. బయట అంతా చీకటిగా ఉంది. అంతలో ఒక్కసారిగా కాల్పుల శబ్ధాలు. బస్సుపైకి బులెట్ల దూసుకొస్తున్నాయి. అయినా సరే డ్రైవర్‌ బస్సును ఆపకుండా కిలోమీటర్‌ దూరం తీసుకొచ్చాడు’ అని అమర్‌నాథ్‌ ఘటనలో గాయపడిన మహారాష్ట్రకు చెందిన భాగ్యమణి తెలిపారు.
ఘటనపై బస్సు డ్రైవర్‌ సలీమ్‌ బంధువు జావెద్‌ గుజరాత్‌లో మీడియాతో మాట్లాడారు. ‘సలీమ్‌ ఏడుగురు ప్రాణాలను కాపాడలేకపోవచ్చు. కానీ.. 50 మందిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయనను చూస్తే గర్వంగా ఉంద‌న్నారు. యాత్రికులను రక్షించడం కోసమే బస్సును అక్కడ ఆపలేదని సలీమ్‌ నాకు ఫోన్లో చెప్పాడు’ అని జావెద్‌ అన్నారు.
ఉగ్ర‌వాదులు బ‌స్సులో ఉన్న ప్ర‌యీనీకుల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రుపుతున్న బ‌స్సుడ్రైవ‌ర్ సలీమ్ మాత్రం త‌న క‌ర్య‌వ్యాన్ని మ‌రువ‌లేదు.బుల్లెట్లు దూసుకొస్తున్నా ధైర్యంగా మిగితా వారిని కాపాడ‌టంకోసం ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా త‌న క‌ర్య‌వ్యాన్ని మాత్రం మ‌రువ‌లేదు. నిజంగా డ్రైవ‌ర్ స‌లీం రియ‌ల్ హీరో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -