Thursday, April 25, 2024
- Advertisement -

లేడీ గెటప్ లో మన హీరోలు..

- Advertisement -

‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అన్నారో సినీకవి. మగ ఆడగా మారినా వన్నె తగ్గదంటూ అద్భుతమైన నటనా కౌశలాన్ని చూపారు తెలుగు సినీ హీరోలు. కొందరు సినిమాలో అధిక భాగం స్త్రీ వేషంలో కనిపించగా, మరికొందరు ఒకటి, రెండు సీన్లలో అతివ వేషం వేసి ఔరా అనిపించారు. వారిలో ఐదుగురి గురించి..

చిరంజీవి – చంటబ్బాయ్
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చంటబ్బాయ్’ సినిమాలోని ఓ పాటలో కాసేపు అమ్మాయిగా కనిపిస్తారు. ‘నా పేరు మిస్సు మేరీ.. నేను కాను మిస్సు ఏదీ!’ అంటూ సాగే పాటలో తెల్ల రంగు గౌనుతో చిరంజీవి భలే అందంగా కనిపిస్తారు.

బాలకృష్ణ – పాండురంగడు
కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పాండురంగడు’ సినిమాలో కృష్ణుడు పాత్ర పోషించిన బాలకృష్ణ కొంతసేపు మాయావేషంలో స్త్రీగా కనిపిస్తారు. వాలు జడ, నిండైన చీరకట్టుతో, కళ ఉట్టిపడే రూపంతో ఉంటారు.

నరేష్ – చిత్రం భళారే విచిత్రం
నటుడు నరేష్ కెరీర్లో ఆల్‌టైం హిట్‌గా నిలిచిన సినిమా ఇది. తెలుగు కామెడీ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఇది. ఇందులో నరేష్ చాలా సేపు అమ్మాయిగా కనిపిస్తారు. రోజా రమణి ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ పాత్రకు నంది జ్యూరీ ప్రత్యేక పురస్కారం అందుకున్నారు ‌నరేష్.

రాజేంద్రప్రసాద్ – మేడమ్
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మేడమ్’ సినిమాలో మహిళా లెక్చరర్ పాత్రలో నటించారు రాజేంద్రప్రసాద్. ఆయన కెరీర్లో గుర్తుండిపోయే అనేక పాత్రల్లో ఇదీ ఒకటిగా మిగిలింది. నంది జ్యూరీ ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.

రవితేజ – ఖడ్గం
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాలో ఒక సీన్లో అమ్మాయి వేషంలో కనిపిస్తారు రవితేజ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -