Thursday, May 2, 2024
- Advertisement -

దిశ చట్టం ఎక్కడ? స్నేహలత మృతిపై పవన్ ఫైర్!

- Advertisement -

ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధులకు అవి చుట్టాలుగానే మారుతున్నాయి. రోజు రోజుకీ మహిళలపై అకృత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అనంతపురంలో దిశ ఘటన తలిపించేలా స్నేహలత అనే యువతి హత్య పలు సంచలనం సృంచింది. తాజాగా స్నేహలత మృతిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, నేరం చేసిన వారికి 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని ప్రచారం చేసిన ఏపీలో ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు.

చిత్తశుద్ధి లేకుండా ప్రచారం కోసం చట్టాలు చేస్తే ఏం ప్రయోజనం అని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం చట్టాలు రూపొందించామని ప్రజలను మభ్యపెట్టి పాలాభిషేకాలు చేయించుకుని, కేకులు కోయించుకున్నారని, కానీ రాష్ట్రంలో మహిళలపై దారుణాలు మాత్రం ఆగలేదని వ్యాఖ్యానించారు.

స్నేహలత చదువు మద్యలో ఆపి చిన్న ఉద్యోగం చేసుకుని జీవిస్తున్న సమయంలో ఆకతాయిలు ఆమెను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అక్కడ నుంచి ఇల్లు మారాలని సలహా ఇవ్వడం ఆమె కుటుంబీకులను మరింత కుంగదీసిందని పోలీసు వ్యవస్థ ఎంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందో దీన్ని బట్టే అర్థమవుతోంది.

వ్యవస్థల వైఫల్యం వల్లే స్నేహలత ఇద్దరు దుర్మార్గుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆడబిడ్డలకు రక్షణ ఇస్తుందో సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ప్రజలకు జవాబు చెప్పాలి అని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -