Friday, May 9, 2025
- Advertisement -

ముగిసిన అధ్యాయం ఇప్పుడెందుకు ప‌వ‌న్‌… మన ప‌రువు మనమే తీసుకోవ‌డం త‌ప్ప‌..

- Advertisement -

అజ్ణాత వాసి సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌వ‌న్ త‌న దైన శైలిలో రాజ‌కీయ‌పార్టీల మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల ప‌రిస్థితుల మీద మాట్లాడితే దాని క‌థ వేరేగా ఉంటుంది. ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యి చాలా సంవ‌త్సారాలు అవుతోంది. దాన్ని గురించి మ‌ళ్లీ ప‌వ‌న్ ఇప్పుడు కెల‌క‌డం చూస్తే చిరంజీవి ప‌రువును గంగ‌లో క‌లిపేశారు.

ప్రజారాజ్యం పార్టీ అంకం ముగిసిపోయింది… కాంగ్ర‌స్‌లో విలీనం చేశారు చిరంజీవి. అందుకు ప్రతిఫలంగా దక్కిన రాజ్యసభ సభ్యుడిగా చిరు కొనసాగుతున్నాడు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి సినిమాల మీద దృష్టి పెట్టారు. ప్ర‌శాంతంగా సినిమాలు తీస్తూ సంతోషంగా జీవ‌తం గ‌డుపుతున్న చిరంజీవిని మ‌రో సారి రాజ‌కీయ కంపులోకి లాగారు ప‌వ‌న్‌.

తాజాగా ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేన స‌మ‌న్వ‌య కార్త‌ల స‌మావేశంలో పవన్ ఆవేశంగా ఊగిపోయారు. రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌గురించి మాట్లాడ‌కుండా సంబందంలేని విష‌యాల గురించి స్పీచ్ దంచి కొట్టారు. ప‌వ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై మాట్లాడాల‌నుకుంటే పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ జిల్లాల‌కు ప్యాకేజీ, ఇలాంటి స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయి. ఇక‌ తెలుగుదేశం ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, అమరావతిలో ఏం జరుగుతోంది? చంద్రబాబు వరస పెట్టి విదేశీ పర్యటనలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. వాట‌న్నింటిమీద మాట్లాడ‌కుండా ప్రజారాజ్యం, పరకాల ప్రభాకర్, అల్లు అరవింద్ వీల్ల గురించి ఇప్పుడు మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంది.

తాజాగా ప‌వ‌న్ మాట్లాడుతూ చిరంజీవి పక్కన స్వార్ధపరులు చేరిపోవటం వల్లే పిఆర్పీ దెబ్బతిన్నదని అన్నారు. త‌న అన్న‌ను మోసం చేసిన వారిని వ‌దిలి పెట్ట‌న‌ని ఆవేశంతో ఊగిపోయారు. లేకపోతే ఇప్పటికి చిరంజీవే ముఖ్యమంత్రిగా ఉండేవారట. ఇక్కడ కూడా పవన్ తన సోదరుడు చిరంజీవి అజ్ఞానాన్నే బయటపెట్టారు. చిరంజీవి వద్దకు వచ్చే వాళ్ళు పబ్బం గడుపుకునేందుకే వస్తారు. అటువంటి వారిని దగ్గరకు తీసుకోవాలి, ఎవరిని సలహాదారుగా ఎంచుకోవాలనే విజ్ఞత చిరంజీవికి ఉండాలి.

జ‌రిగిపోయిన దాన్ని మ‌ళ్లీ కెలికి ప‌వ‌న్ కంపు పులేపారు. ఎన్నిక‌ల్లో పిఆర్పీకి 18 సీట్లు వచ్చాయి. అయితే, 18 మంది ఎంఎల్ఏలతో ఐదేళ్ళు కూడా ప్రతిపక్షంగా నిలవలేకపోయారు. అప్పట్లో చిరంజీవి గానీ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయకపోయుంటే ఇపుడు పవన్ చెబుతున్న మాటలకు విలువుండేది. చిరంజీవిని ఎవరో మోసం చేసారని అంటున్న పవన్ పిఆర్పిని నమ్మి ఓట్లేసిన 70 లక్షల మంది ఓటర్లను చిరంజీవి మోసం చేయలేదా..? మ‌రి ప‌వ‌న్ ఇలా మాట్లాడ‌టంపై సోషియ‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. అన్న చిరంజీవికి రాజ‌కీయాలు తెలియ‌వ‌ని అందుకే అంద‌రూ మోసం చేశార‌ని చెప్ప‌డం చూస్తే… రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌ని త‌మ్ముడే స‌ర్టిఫికెట్ ఇచ్చార‌నుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -