Thursday, May 8, 2025
- Advertisement -

చావు కేకల మధ్య కూడా పచ్చ మీడియాది బాబు బాకానే

- Advertisement -

ఆంధ్రజ్యోతి ప్రయాణం గురించి ఈ మధ్యనే ఒక గొప్ప స్వోత్కర్షతో కూడిన వీకెండ్ కామెంట్ రాశాడు ఆర్కే. ఆ కామెంట్‌లో అంతా కూడా ప్రజల కోసం పాటుపడిన ఓ గొప్ప జర్నలిస్ట్‌గా తనను తాను రకరకాలుగా వర్ణించుకున్నాడు. పనిలో పనిగా వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి కూడా ఎన్నో అబద్ధాలు చెప్పాడు. ఆర్కే చెప్పినవన్నీ అబద్ధాలన్నీ ఆ మరుసటి రోజే ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఖండించాడు. ఆంధ్రజ్యోతితో కలవాలన్న ఆలోచన తమకు ఎప్పుడూ లేదని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ ఆర్కే మాత్రం సిఎన్ఎన్ ఐబిఎన్ తమతో కలుస్తుంటే వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకున్నాడని ఎంచక్కా తనకు తోచింది రాసుకుపోయాడు. తనను తాను హీరోగా వర్ణించుకుంటూ వైఎస్‌ని విలన్‌ని చేసే ప్రయత్నం చేశాడు.

ప్రజల కోసం పాటుపడే పత్రిక మాది అని గట్టిగా పది రోజుల ముందే చెప్పుకున్న ఆర్కే ఇప్పుడు మాత్రం చావు కేకల మాధ్య కూడా బాబు బాకా ఊదడానికే ప్రాధాన్యతనిస్తున్నాడు. పుష్కరాల టైంలో చావులకు కూడా జనాలదే తప్పన్న ఆర్కే …ఇప్పుడు కూడా ప్రయాణికులందరూ ఒకవైపుకు వెళ్ళబట్టే ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు. ప్రతిపక్ష వైకాపా నాయకులు ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడుతుంటే ఆర్కే మాత్రం ప్రభుత్వం తప్పేమీ లేదని సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ప్రభుత్వ సిబ్బంది అడ్డుకోవాలని ప్రయత్నం చేశారట. అందుకని వాళ్ళ తప్పేమీ లేదు అన్నది ఆర్కే వాదన.

అనుమతి లేని ఒక బోటు, అనుభవం లేని ఒక డ్రైవర్ కారణంగా ప్రమాదం జరిగింది అన్న మాట వాస్తవం. ప్రజాధనం కోట్లలో ఖర్చుపెడుతూ టూరిజం సిబ్బందిని, పోలీసులను ఎందుకు నియమించినట్టు? ప్రపంచానికే టూరిజం హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తానని చెప్పుకునే చంద్రబాబు పరిపాలనా సమర్థత ఇంతేనా? మామూలుగా అయితే ఇక్కడ చంద్రబాబుని నిందించడం భావ్యం కాదు. కానీ ప్రతి చిన్న పనిలోనూ వేలు పెడుతూ, ప్రతి చిన్న విజయాన్ని తన అకౌంట్‌లో వేసుకోవాలని ప్రయత్నించే చంద్రబాబు పరాజయాల బాధ్యత కూడా తీసుకోవాలిగా? ప్రపంచానికే పాఠాలు చెప్పానని డప్పాలు కొట్టుకునే చంద్రబాబు పరిపాలనా సామర్థ్యం ఇంతేనా? విహార యాత్ర కోసం వచ్చిన 20 మందికి పైగా ప్రయాణికులు బోటు ప్రమాదంలో మృతిచెందారన్న వార్త రాష్ట్ర టూరిజంకి ఎంత చెడ్డపేరు తెస్తుందో చంద్రబాబుకు తెలియదా? తన నివాసానికి కూత వేటు దూరంలో ఉన్న చోటే పరిపాలనా సామర్థ్యం ఇలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నట్టు? ఈ ప్రమాదం జరగక ముందు వరకూ కూడా అమరావతి, కృష్ణానది ప్రాంతాలను ప్రపంచ టూరిజం హబ్‌గా మారుస్తున్న చంద్రబాబు అని బాకా ఊదిన పచ్చ మీడియా ఇప్పుడు కనీస మాత్రంగా కూడా విమర్శించే ప్రయత్నం చేయకుండా అంతా జనాల తప్పు, బోటుదే తప్పు అని వార్తలు వండడం భావ్యమేనా?

20మందిని బలిగొన్న ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం పుణ్యమాని చంద్రబాబుకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని చెప్పి పచ్చ మీడియా తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. అగ్రశ్రేణి పత్రిక, నంబర్ ఒన్ పత్రికది కూడా అదే ధోరణి.

‘బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి’

‘బోటు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన జగన్’

బోటు ప్రమాద వార్తలతో పాటు నంబర్ ఒన్ పత్రిక అని చెప్పుకునే ఈనాడులో వచ్చిన ఒక వార్తలో పై రెండు హెడ్‌లైన్స్ కనిపించాయి. అది కూడా చంద్రబాబు దిగ్ర్భాంతి అంటూ పైన ఒక వార్త. ఆ క్రిందనే విచారం వ్యక్తం చేసిన జగన్ అని మరోవార్త. ప్రమాదం జరిగి కొంతమంది చనిపోతే బాబేమో దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు, ఆవేధన చెందాడు అని రాస్తారు. కానీ జగన్ మాత్రం జస్ట్ ఏదో విచారం వ్యక్తం చేశాడు అన్నట్టుగా రాస్తారు. అక్కడ కూడా బాబు గొప్పతనాన్ని చూపించాలన్న ప్రయత్నం, జగన్‌ని తక్కువ చేయాలన్న ప్రయత్నమే తప్ప ఎక్కడా కూడా జర్నలిజం ఎథిక్స్ కనిపించవు. ఇక టిడిపి భజన ఛానల్స్, వెబ్‌సైట్స్ అన్నీ కూడా ఇదే తరహాలో ఇష్టం వచ్చినట్టుగా వార్తలు అందించి బాబు ముడుపులకు న్యాయం చేశాయి. కానీ ప్రమాదం జరిగిన గంట సేపటి వరకూ సహాయక చర్యలు చేపట్టలేదు…..వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఉంటే మృతుల సంఖ్య తగ్గేది అన్న బాధితుల గోడు మాత్రం పచ్చ మీడియాకు అస్సలు వినిపించలేదు. పైగా సత్వరమే సహాయక చర్యలు మొదలయ్యాయని కథలు అల్లేశారు. వైఎస్‌లకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రాజకీయ వైరం అనుకోవచ్చు కానీ బాబుని సమర్థించాలన్న ప్రయత్నంలో ప్రజల చావు కేకలను కూడా వినిపించుకోకపోవడం మాత్రం పచ్చ మీడియా పతనానికి పరాకాష్ట అని ఎందుకు చెప్పకూడదు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -