వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పెట్టుకున్న అంచనాలు తారుమారవుతున్నాయి. విజయాలు గుమ్మం ముంగిటకు వచ్చి వెనక్కు పోతున్నాయి. జగన్ సభలకు లక్షలాదిగా ప్రజలు వస్తున్నా….. వారిని ఓటర్లుగా మలుచుకోవడంలో విఫలమవతున్నారు. సభలకు వచ్చిన జనాలలో కనీసం కొంతైనా ఓట్లుగా మలుచుకుంటె పార్టీకి తిరుగుండదు. కాని జగన్ వ్యవహార శైలికారనంగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.
అధికారపార్టీనుంచె కాకుండా సొంత పార్టీ నుంచి తీవ్ర విమర్శలు జగన్‌పై వస్తున్నాయి. సామాన్య ప్రజానీకం కూడా ఆయన వ్యవహారశైలిపై విమర్శిస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ అధినేతలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు భారీ కసరత్తు మొదలు పెట్టారు. ముందుగా వ్యవహార తీరు మార్చుకుంటేనే బెటర్ అనే ఆలోచనకు వైసీపీ వచ్చినట్టు తెలుస్తోంది. ఎంతసేపు అధికార టీడీపీని విమర్శించడానికే జగన్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇప్పటినుంచి ప్రజలకు తను ఏం చేయబోతున్నారో చెప్పేందుకు సంయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
విమర్శలు వస్తున్న పేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించే పనిలో వైసీపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఆక్టోబురులో నిర్వహించ నున్న పాదయాత్రకు ముందుగానె ప్రజలకు చేరువ అయ్యేదానికి కార్యక్రమాలు రూపొందించారు.
దానిలో భాగంగానె పార్టీని ఇంటింటికీ చేర్చేందుకు, కోటి కుటుంబాలకు చేరువయ్యేందుకు 60 రోజుల విస్తృత ప్రచారానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం ‘నవరత్నాల సభలు’, ‘ వైఎస్సార్ కుటుంబం’, ‘విజయ శంఖారావం’ అనే మూడు కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు పార్టీ నాయకులు. జగన్ పాదయాత్ర మొదలు పెట్టే నాటికి పార్టీని ఇంటింటికి తీసుకెల్లేయేచనలో నాయులకు ఉన్నారు.