ప్రత్యేకహోదాకోసం వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం చివరి దశకు చేరింది. ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించిం అధికారంలోకి వచ్చిన భాజాపా-టీడీపీ తర్వాత ప్లేటు ఫిరాయించిన సంగతి తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలుగా జగన్ రాష్ట్రంలోనూ, ఢిల్లీలోను హోదా చిత్తశుద్దితో పోరాటం కొనసాగిస్తున్నారు. చివరకు ఒక్క జగన్ మాత్రమే ప్రత్యేకహోదా సిధించగలరని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే జగన్ చేస్తున్న పోరాటానికి ప్రజలు, యువకులు, విద్యార్థలు పూర్తి మద్దతు ఇస్తున్నారు.
ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్ చేసిన పోరాటాలను గుర్తు చేసకుంటే మే 15, 2015న ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేకహోదా రాష్ట్రానికి ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. మే 2015న పార్లమెంట్ ముందుఎంపీలతో ధర్నా, జూన్3,4న మంగళగిరిలో రెండు రోజులపాటు సమర దీక్ష, 9 జూన్ 2015న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు.
10 ఆగష్ట్ 2015 ప్రత్యేకహోదా కోరుతూ ఢిల్లీలో ధర్నా, 29 ఆగష్ట్ 2015న రాష్ట్రబంద్, 15 సెప్టెబర్ 2015న తిరుపతిలో యువభేరీ, 22 సెప్టెంబర్ 15న విశాఖలో యువభేరీ నిర్వహించారు. 7 అక్టోబర్ 2015న నల్లపాడులో ఆరు రోజుల నిరహారా దీక్ష, 27 జనవరి 2017న కాకినాడ, 2 ఫిబ్రవరి న శ్రీకాకులంలో యువభేరి. 24 ఫిబ్రవరి 2016 న రాష్ట్రపతికి వినతిపత్రం, 10 మే 2016న కలెక్టరేట్ల వద్ద జగన్ దర్నా, 2 ఆగష్ట్ 2016న రాష్ట్రబంద్, 4 ఆగష్ట్ 2016 నెల్లూరు, 10 సెప్టెబంర్‌న రాష్ట్రబంద్, 22 సెప్టెంబర్ ఏలూరు, 25 అక్టోబర్ కర్నూలులో యువభేరి, 6 నవంబర్ 2016న విశాఖలో బహిరంగసభ నిర్వహించారు.
19 డిస్సెంబర్ 2016న విజయనగరం, గుంటూరులో యువభేరీ, 10 అక్టోబర్ 2017న అనంతపురంలో యువభేరీ, 1 మార్చి 2018 జిల్లాకేంద్రాల వద్ద ధర్నా, 5 మార్చి 2018న ఢిల్లీలో ధర్నా, మార్చి 5 నుండి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్‌లో పోరాటం కొనసాగించానున్నారు.
చివరి అస్త్రంగా మార్చి 22న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందకు వైసీపీ సిద్ధమయ్యింది. ఏప్రిల్ ఆరులోగా ప్రత్యేకహోదా కేంద్రం ప్రకటించకపోతే పీర్టీ ఎంపీలు రాజీనామా చేయనున్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుండీ పోరాడుతున్నదీ.. చివరికి సాధించేదీ జగనే అని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.