Tuesday, May 14, 2024
- Advertisement -

సత్యహరిశ్ఛంద్ర, ధర్మరాజు కూడా ఆర్కే దృష్టిలో విలన్లే…. జగన్ విలువలు పాటించడం తప్పట

- Advertisement -

‘విలువలతో కూడని రాజకీయాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ ఆచరణలో ఎదురుకొడతాయి’……. ఈ అమూల్యమైన నీతి చెప్పిన మహానుభావుడు ఎవరో తెలుసా? జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేసి తప్పు మీద తప్పు చేస్తున్నాడని బాష్యం చెప్పిన మహనీయుడు ఎవరో తెలుసా? గట్టిగా కొన్ని రోజుల క్రితమే నిబద్ధతతో కూడిన ప్రయాణం అని చెప్పి తన డప్పు తానే బ్రహ్మండంగా కొట్టుకున్న రాధాకృష్ణ. తన గురించి తానే పొగుడుకోవడంలో చంద్రబాబుని కూడా మించిపోతుంటాడు రాధాకృష్ణ.

విలువలు, నీతి, నిజాయితీలాంటి విషయాల్లో తనంతటోడు లేడని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ అందుకు పూర్తి వ్యతిరేకంగా రాధాకృష్ణ జర్నలిజం ఉంటుంది. తెలుగు జర్నలిజాన్ని పాతాళం స్థాయికి దిగజార్చిన పేరెన్నికగన్న జర్నలిస్టుల్లో రాధాకృష్ణే ప్రథముడు అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. కావాలంటే ఈ క్రింది విషయం చదివాకే రాధాకృష్ణ జర్నలిజం స్థాయి ఏంటో మీరే చెప్పండి ‘నంద్యాల ఎన్నికలకు ముందు వైకాపాలో చేరిన చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించడం జగన్ చేసిన తప్పు. విలువలతో కూడిన రాజకీయాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ ఆచరణలో ఎదురుదెబ్బలు కొడతాయి……’ ఈ అమూల్యమైన వాఖ్యాలు రాధాకృష్ణ నోటివెంట వచ్చాయి. ఇప్పుడు చెప్పండి ……మనిషిగా రాధాకృష్ణను ఏమని అనుకోవాలి. ఆయన జర్నలిజం స్థాయిని ఎలా చూడాలి? నిజాయితీకి కట్టుబడి ఉండబట్టే సత్య హరిశ్ఛంద్రుడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. మహా రాజు అయిన వాడు కాస్తా భార్య, బిడ్డలను కోల్పోయి చివరికి కాటికాపరిగా కూడా చేయాల్సిన దుస్థితికి వచ్చాడు.

ఇదే రాధాకృష్ణ సత్య హరిశ్ఛంద్రుడి గురించి ఏమని చెప్తాడు? అబద్ధం ఆడి ఉంటే బాగుండేది….విలువలు పాటించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు అని సలహా ఇస్తాడా? అలా చేసి ఉంటే ఆయన సత్యహరిశ్ఛంద్రుడిగా … మహోన్నత శిఖరాగ్రస్థాయి మనిషిగా ఉండేవాడా? అబద్ధం ఆడి ఉంటే రాధాకృష్ణగా మిగిలిపోయేవాడు కాదా? ఇక ధర్మరాజుతో సహా విలువలు పాటించి అత్యున్నత మహనీయులుగా నిలబడినవారు ఎందరో? వారందరూ కూడా కష్టాలు అనుభవించినవాళ్ళే. విలువలకు కట్టుబడ్డారు కాబట్టే గొప్పవారయ్యారు. కానీ రాధాకృష్ణ మాత్రం మరో రకం.

ఇక్కడ జగన్‌ని సత్యహరిశ్ఛంధ్రతో, ధర్మరాజుతో అస్సలు పోల్చడం లేదు. కానీ విలువలు పాటించి జగన్ తప్పులు చేస్తున్నాడన్ని రాధాకృష్ణ నీచమైన జర్నలిజం, విలువల వలువలు వదిలేసిన మాటల గురించే చెప్తున్నాం. ఇఫ్పుడు మీరే చెప్పండి. రాధాకృష్ణ గురించి…..రాధాకృష్ణ జర్నలిజం గురించి ఏమని చెప్పాలో? మరోసారి ఏ జర్నలిస్ట్ కానీ, మనుషులు కానీ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు, నీతి బాహ్యమైన మాటలు చెప్పకుండా ఉండాలంటే ఈ న్యూస్‌ని వీలైనంత ఎక్కువమందికి చేరేలా మీరే ప్రోత్సహించండి. మరోసారి ఎవ్వరూ కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా చేయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేయమని చెప్తున్నాం. సోషల్ మీడియా ద్వారా అయినా మీరు కూడా స్పందిస్తే మరోసారి ఇలా దిగజారడానికి ఇంకెవ్వరూ ప్రయత్నం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది? లేకపోతే భవిష్యత్తరాలు మానవత్వాన్ని, విలువలను పూర్తిగా మర్చిపోయేలా చేయగలవాళ్ళే మేధావులుగా చెలామణి అవుతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -