పవన్ కళ్యాణ్‌పై సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించాడు జగన్. అవన్నీ కూడా ప్రస్తుత రాజకీయాలను ప్రభావితం చేసేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఉపయోగపడేవి. కానీ పవన్ దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. అందుకే నేను ముఖ్యమంత్రి కొడుకును కాదు, ప్రజల సొమ్ము దోచుకోలేదు లాంటి పాత డైలాగులు పేల్చాడు. ఇప్పుడు ఈ డైలాగులతో ఏమైనా ఉపయోగం ఉందా? ఒకవేళ జగన్ దోచుకున్నాడు అని పవన్‌కి అంత నమ్మకం ఉంటే చంద్రబాబు, కెసీఆర్లతో జిగిరీ దోస్తీ చేస్తున్న భజనసేనుడు జగన్ దోచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకోమని వాళ్ళకు చెప్పొచ్చుగా? జగన్ దోచుకున్న ఆస్తులు స్వాధీనం చేసుకుని రుణమాఫీలు చేస్తానన్న చంద్రబాబు నాలుగేళ్ళుగా ఏం చేస్తున్నట్టు? ఇక అవినీతి గురించి పవన్‌కి మాట్లాడే అర్హత ఉందా? ఓటుకు కోట్లు కేసులో తనను తాను సమర్థించుకోలేక చంద్రబాబే సతమతమవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం అది తప్పే కాదన్నట్టుగా సర్టిఫికెట్ ఇచ్చేశాడు.
ఇక అవిశ్వాస తీర్మానానికి రెడీయా అని జగన్‌ని రెచ్చగొట్టింది పవన్. పవన్ ఛాలెంజ్‌ని జగన్ స్వీకరించాడు. రెడీ అన్నాడు. మరి పవన్ ఏం చేస్తున్నాడు? నంగి నాటకాలు ఆడుతున్నాడు. నిజం. అవిశ్వాసానికి రెడీ అని జగన్ అన్న తర్వాత నుంచీ అవిశ్వాసం గురించి మాట్లాడడమే మానేశాడు పవన్. ఎందుకంటే అవిశ్వాసం చంద్రబాబుకు ఇష్టం లేదు కాబట్టి. అవిశ్వాసం పెడితే ఏం ఒరుగుతుంది అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ మంత్రులు తప్పుకున్నా, చంద్రబాబు బిజెపికి మద్దతు ఉపసంహరించుకున్నా ఏం ఒరుగుతుంది అంటే ఎవరైనా ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రక్రియలే అవన్నీ కూడా. అలాగే అవిశ్వాసం కూడా. తన ఎంపీల చేత పార్లమెంట్ ముందు నాటకాలు వేయిస్తున్న చంద్రబాబుకు ఎందుకో అవిశ్వాసం అంటే మాత్రం ఏదో భయం పట్టుకుంది. అందుకే పవన్‌కి కూడా అవిశ్వాసం ఇష్టం లేకుండా పోయింది.
2014 నుంచీ పవన్ రాజకీయ ప్రస్థానాన్ని చూసిన ఎవరికైనా చంద్రబాబు భజనసేనుడు పవన్ అన్న విషయంలో ఓ స్పష్టతరాదా? రాజధాని భూముల సేకరణ విషయంలో ఒక రోజు మేకప్ షో చేశాడు పవన్. ఉద్థానం కూడా సేం టు సేం. ఇక ప్రత్యేక హోదాపై మాత్రం మూడు రోజుల షో చేశాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబుని మాత్రం పల్లెత్తు మాట అనడు. పుష్కర ప్రమాదం, పడవ ప్రమాదం, బాబు అవినీతి వ్యవహారాలు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు……ఎప్పుడైనా ఏ విషయంపైన అయినా చంద్రబాబు చేస్తోంది తప్పు అని అనగలిగాడా పవన్? అందుకే జగన్ కూడా పవన్‌ని బాబు పార్టీ మనిషిి అని అన్నాడు. పవన్ కళ్యాణ్-చంద్రబాబుల బంధం గురించి తెలియనివాళ్ళు తెలుగునాట ఉన్నారా? బాబు భజన మీడియా వార్తలు చూసినా ఆ విషయం అర్థం కాదా? మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజల తలపై రుద్ది నాలుగేళ్ళుగా నాటకాలు ఆడుతున్నది చంద్రబాబు, పవన్. ఈ నాలుగేళ్ళ వ్యవహారం గురించి ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. కానీ ప్రత్యేక హోదాతో సహా అన్ని విషయాల్లోనూ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న జగన్ విశ్వసనీయతను మాత్రం పచ్చ జనాల పడికట్టు పదాలు పలుకుతూ ప్రయత్నిస్తూ ఉంటాడు. చంద్రబాబు, పవన్‌లు మోడీకి వ్యతిరేకంగా అంత పొడిసే వాళ్ళు అయితే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మాట్లాడొచ్చుగా. పవన్ ఛాలెంజ్‌ని జగన్ స్వీకరిస్తే అభినందించాల్సింది పోయి చంద్రబాబుకు అనుకూలంగా నంగి మాటలు మాట్లాడుతున్న పవన్ బాబు జేబులో బొమ్మ కాదు అని ఎలా నమ్మాలి? చంద్రబాబుకు నాకు సంబంధం లేదు….2019 ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తా అని పవన్ స్పష్టంగా చెప్పగలడా ధైర్యం ఉంటే? నాలుగేళ్ళుగా ప్రజల మధ్యన ఉన్న జగన్‌కి……అప్పుడప్పుడూ మేకప్ వేసుకుని ప్రజల ముందుకు వచ్చే పవన్‌కి అసలు పోలిక ఉందా?