ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య సౌథాంప్టన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బైలింగ్ ఎంచుకుంది ఆప్ఘన్. ఇప్పటికే వరుస ఓటములతో సెమీస్ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో జోరు మీదున్న బంగ్లా సెమీస్ బెర్తుకోసం ప్రయత్నిస్తోంది.
ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ బంగ్లాదేశ్ ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఆ జట్టు ఐదు పాయింట్లతో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇరు జట్లు 7 సార్లు వన్డేల్లో తలపడగా, 4 సార్లు బంగ్లాదేశ్ గెలిచింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్ విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఒకసారి మాత్రమే ముఖాముఖి పోరులో తలపడ్డాయి. అందులో బంగ్లాదేశ్ గెలుపొందింది. 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ 105 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది.
అఫ్గానిస్థాన్ జట్టు:
గుల్బాదిన్ నైబ్, సమీవుల్లా షిన్వారీ, రెహ్మత్ షా, హష్మతుల్లా షాహిది, అస్గార్ అఫ్గాన్, మొహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, ఇక్రామ్ అలీ ఖిల్, రషీద్ ఖాన్, దవ్లాత్ జద్రాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.
బంగ్లాదేశ్ జట్టు:
తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్, షకీబ్‌ఉల్ హసన్, ముష్పికర్ రహీమ్, లిటన్ దాస్, మహ్మదుల్లా, మొసదీక్ హసన్, మహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, ముష్రఫే మోర్తజా, ముస్తాఫిజర్ రెహ్మాన్.