మాజీ వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ రఫేల్ నాదల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు మేరీ పెరెల్లోను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్యే విరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. దాదాపు 14 ఏళ్లుగా పెరెల్లోతో నాదల్ డేటింగ్ చేస్తున్నాడు. ఈ మధ్య రోమ్ టూర్‌లో నాదల్ మేరికి ప్రపోజ్ చేశాడు. నాకు ఓ ఫ్యామిలీ ఉండాలని కోరకుంటున్నాను.. పిల్లలతో ఆడుకోవడమంటే నాకు చాలా ఇష్టమంటూ ఓ స్పానిష్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు 32 ఏళ్ల ఈ టెన్నిస్ ప్లేయర్.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకున్న నాదల్ మొత్తం 17 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్నాడు. అయితే వరుస ఈవెంట్లు ఉండటంతో వీరి పెళ్లి వాయిదా పడుతున్నట్టు సమాచారం. కానీ త్వరలోనే ఈ ఇద్దరి పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏటీపీ టెన్నిస్ ఈవెంట్లు ముగిసిన తర్వాత, బహుశా అక్టోబర్ లేదా నవంబర్‌లో భాజభజంత్రీలు మోగనున్నాయి.