అషుతో డేటింగ్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఇండస్ట్రీ లో సింగర్ గా మరోవైపు సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ తనతో పాటు హౌస్ మెట్ అయిన అషురెడ్డితో ప్రేమలో ఉన్నాడేమో అనిపించేలా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, అలాగే అషురెడ్డిని రాహుల్ సిప్లిగంజ్ ఎత్తుకున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఆ మధ్య ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో సైతం ఈ ఇద్దరు పాల్గొని మరింత సందేహాలు పెంచారు.

తాజాగా ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ తనకు అషు రెడ్డి చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. వీరిద్దరి డేటింగ్ కి సంబంధించి రాహుల్ కామెంట్స్ చేయగా దానికి అషురెడ్డి ఆసక్తికరంగా స్పందించింది.తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె ఈ వీడియోని మెన్షన్ చేసి థాంక్యూ నాకు ఏడుపు వచ్చేస్తుంది నువ్వు ఎప్పటికీ స్పెషల్ రాహుల్ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

Also read:నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

ఇద్దరం స్పెషల్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. అయితే అదే షోలో రాహుల్ కోసం ‘పిలగా.. పిలగా.. భూలోకం మొత్తంలో నువ్వే నాకు తోడు.. నీ కోసం వచ్చేస్తా ఎందాకైనా చూడు.. ఇక ఇద్దరమూ ఆడేద్దామూ క్రేజీగా ఈ షోలో’ అంటూ పాట పాడింది అషు రెడ్డి. ఆ తర్వాత రాహుల్ ఆమెను దగ్గరకు తీసుకుని ఇంటర్వ్యూ మధ్యలో హగ్ ఇచ్చాడు ఇద్దరి మధ్య ఏముంది అని అడిగితే ‘కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం.. హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాం..’ అని రాహుల్ చెప్పడం వీరి మధ్య ఏదో ఉందనే సందేహాలు పెంచింది.

Also read:టాలీవుడ్ హీరోయిన్లను దూరం పెడుతున్న ప్రభాస్.. కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -