Saturday, April 20, 2024
- Advertisement -

క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు స్పెషల్ థ్యాంక్యూ చెప్పిన బన్నీ..!

- Advertisement -

అల వైకుంఠపురములో సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో అల్లు అర్జు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

ఈస్ ఇనిమాలోని పాటలు ఏ రెంజ్ లో హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ బాగా వైరల్ అయింది. టిక్ టాక్ వంటి వాటిలో ఈ పాటకు బాలీవుడ్ స్టార్స్ కూడా స్టెప్పులు వేయడం విశేషం. ఇక కరోనా దెబ్బకు క్రికెట్ ప్రపంచం కూడా ఇంటికే పరిమితమైంది. లాక్ డౌన్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో ఇంట్లోనే ఉంటున్న ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ టాలీవుడ్ హిట్ సాంగ్ ‘బుట్టబొమ్మా, బుట్టబొమ్మా’ పాటకు తన అర్ధాంగితో కలిసి టిక్ టాక్ వీడియోలో స్టెప్పులేయడం తెలిసిందే.

సోషల్ మీడియాలో ఆ వీడియో ఎంతో వైరల్ గా మారింది. దీనిపై టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ స్పందించాడు. “థ్యాంక్యూ వెరీ మచ్. మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు దేశాల ఎల్లలు దాటి ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ కుటుంబాన్ని సైతం ఈ పాట ఆకట్టుకుంది.

https://www.instagram.com/p/B_mINrppW7d/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -