ఆసియా కప్‌కు విరాట్ కోహ్లీ దూరమయిన సంగతి తెలిసిందే. వరుసగా మ్యాచ్‌లు ఆడుతుండటంతో మేనేజ్‌మెంట్ విరాట్‌కు విశ్రాంతి నిచ్చింది. అయితే అప్పటి నుంచి పాక్ అభిమానులు కోహ్లీకీ వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. తాజాగా భారత్ చేతిలో పాక్ ఓడిపోవడంతో దాన్ని జీర్నించుకోలేని పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు చేశాడు.
కోహ్లీని విమర్శించిన తన్వీర్ అహ్మద్‌కు భారత క్రికెటర్ గౌతం గంభీర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గంభీర్ బాగా గడ్డిపెట్టాడంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసియా కప్ నుంచి కోహ్లీ పారిపోయాడని పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగకుండా.. నా అంచనా ప్రకారం పాక్ జట్టుకు భయపడే కోహ్లీ ఆసియా కప్ నుంచి వైదొలగి ఉంటాడు. దేశం తరఫున ఇంగ్లాండ్ గడ్డపై ఆ జట్టు మీద ఆడిన కోహ్లీ.. ఆసియా కప్‌లో ఎందుకు ఆడటం లేదు. పాక్ జట్టుతో ఫైనల్స్ సహా మూడుసార్లు తలపడాల్సి వస్తుందని కోహ్లీ ముందే ఊహించి తప్పించుకున్నాడంటూ’ కోహ్లీపై తన్వీర్ నోరు పారేసుకున్నాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాక్ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలను గంభీర్ ఖండించాడు. ‘ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన కోహ్లీ పేరు మీద ఇప్పటికే 35 36 సెంచరీల రికార్డు నమోదైంది. మరో శతకం బాదడం కోహ్లీకి కష్టమేమీ కాదు. కానీ నీ పేరు మీద కనీసం 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లేవు. అలాంటి నువ్వు కోహ్లీని విమర్శించడమా’ అని తన్వీర్‌కు గంభీర్ ఘాటు సమాధానం ఇచ్చాడు.