Sunday, May 4, 2025
- Advertisement -

టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న ఆప్ఘ‌న్‌..సార‌థిగా ధోనీ

- Advertisement -

ఏషియాకప్‌లో భాగంగా తన చివరి సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్థాన్. నామ‌మాత్ర‌పు మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ‌కు రెస్ట్ ఇవ్వ‌డంతో కెప్టెన్‌గా ధోనీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈమ్యాచ్‌లో ఎకంగా ఐదు మార్పులు చేసింది మేనేజ్‌మెంట్‌.

రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌కు రెస్ట్ ఇచ్చారు. ఇది ధోనీకి కెప్టెన్‌గా 200వ వ‌న్డే కావ‌డం విశేషం. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత దాదాపు రెండేళ్ల‌కు మ‌రోసారి ధోనీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఐదుగురి స్థానంలో కేఎల్ రాహుల్‌, మ‌నీష్ పాండే, దీప‌క్ చ‌హ‌ర్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, సిద్ధార్థ్ కౌల్ టీమ్‌లోకి వ‌చ్చారు.

భారత్‌: లోకేశ్‌ రాహుల్‌, అంబటి రాయుడు, మనీశ్‌ పాండే. ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, కేదార్ జాదవ్‌, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -