ప్రపంచ కప్ గెలుస్తామనే ధీమాతో ఉన్న టీమిండియాకు ఆస్ట్రేలియా జట్టు భారీ షాకిచ్చింది. టి -20 సిరీస్‌తో పాటు, వన్డే సిరీస్‌ను గెలుచుకుని భారత్ జట్టుకు ఝలక్ ఇచ్చింది. ప్రపంచ కప్‌కు ముందు జరిగిన చివరి సిరీస్‌లో ఓడి భవిష్యత్తుపై అనుమానులు తెచ్చింది ఇండియా జట్టు. ఐదు వన్డేల సిరీస్‌లో చేరు రెండు మ్యాచ్‌లలో విజయం సాధించాయి. నిర్ణయాత్మక మ్యాచ్ ఢిల్లీ ఫిరోషా కోట్ల మైదానంలో జరిగింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా జట్టు. నిర్ణిత 50 ఓవర్లలో 272 పరుగులు చేసింది.
ఉస్మాన్ ఖాజా( 100) సిరీస్‌లో రెండో సెంచరీ సాధించగా, హ్యాండ్స్‌కోంబ్ (52) పరుగులు చేసి రాణించారు. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 237 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ ఒక్కడే అర్థసెంచరీ(56) తో రాణించాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ రెండు కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖాజాకు దక్కాయి.
- Advertisement -
ప్రపంచ కప్‌కు ముందు భారత్‌కు భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -