స్వదేశంలో జరిగిన వన్డేసిరీస్‌ను ఆసిస్ 3-2 తో కైవసం చేసుకుంది. మొదటి రెండు వన్డేల్లో గెలిచిని టీమిండియా తర్వాత మూడు వన్డేల్లో ఘోరంగా పరాజయం చెంది సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా మేనేజ్ మెంట్ కుర్రాల్లకి అవకాశాలు ఇస్తూ ప్రయోగాలు చేసింది. దానిలో భాగంగానే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చివరి మూడు వన్డేలకు అవకాశం కల్పించింది. అయితే రిషబ్ మూడు మ్యాచ్‌ల్లోను ఆశించిన విధంగా అకట్టుకోలేదు. సీరీస్ ఓటమిపై కోహ్లీ స్పందించారు. ఈ ఓటమి తమకి మంచే చేసిందని వ్యాఖ్యానించిన కోహ్లీ.. సిరీస్‌లో చేసిన తప్పిదాలను ప్రపంచకప్‌లో దిద్దుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ప్రపంచ కప్‌కు రిషబ్‌పంత్‌పై వేటు తప్పదని సంకేతాలిచ్చారు. ఆస్ట్రేలియాతో సిరీస్ కంటే ముందు జట్టులో రెండు స్థానాలకి (నెం.4 బ్యాట్స్‌మెన్, రెండో వికెట్ కీపర్) ఆటగాళ్లని పరీక్షించాలని చెప్పిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఒక స్థానంపై పూర్తి స్పష్టత వచ్చినట్లు పరోక్షంగా అంగీకరించాడు. సిరీస్‌లో నెం.4లో ఆడిన అంబటి రాయుడు నిరాశపరచగా.. అతనిపై మధ్యలోనే వేటు వేశారు. ఇక చివరి రెండు వన్డేల్లో ధోనీ స్థానంలో వికెట్ కీపర్‌గా ఆడిన పంత్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో.. వరల్డ్‌కప్‌లో రెండో వికెట్ కీపర్‌గా పంత్‌ను ఎంచుకుని.. నెం.4లో అంబటి రాయుడి స్థానంలో విజయ్ శంకర్‌ని ఆడించాలనే ఆలోచనలో కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి
- Advertisement -
అతనిపై వేటు తప్పదు….కోహ్లీ…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -