Saturday, May 4, 2024
- Advertisement -

టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్ జారీ….

- Advertisement -

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.షమీ భార్య హసీన్‌ జహాన్‌ దాఖలు చేసిన గృహ హింస ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అలీపూర్‌ కోర్టు షమీతో పాటు ఆయన సోదరుడు హసీద్‌ అహ్మద్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 15 రోజుల్లోగా సరెండర్ కావాలని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు ఆదేశించింది.

కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పట్ల బీసీసీఐ స్పందించింది.ఛార్జిషీటును చూసేంత వరకూ షమీపై ఎలాంటి చర్యా తీసుకోబోమని స్పష్టం చేసింది. ఛార్జీషీటును తెప్పించుకొని పరిశీలించాకే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -