టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో తలుక్కుమన్నారు. ఇంగ్లండ్ వేదికగా మూడు నెలల వ్యవధిలో మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నీ కోసం ప్రత్యేకంగా జెర్సీలు డిజైన్ చేశారు. జట్టు అపెరల్ పార్ట్‌నర్ ‘నైకీ’ వచ్చే సీజన్ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. శుక్రవారం పార్క్ హయత్ హోటల్ వేదికగా జరిగిన జెర్సీ ని ఆవిష్కరించారు. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో కెప్టెన్ కోహ్లీతో పాటు ధోనీ, రహానే, పృథ్వీషా, మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. నేటినుంచి జరిగే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు. బ్రాండ్ అంబాసీడర్ నైకీ రూపొందించిన జెర్సీలో రెండు రకాల నీలం రంగు షేడ్స్ ఉన్నాయి. కాలర్ వెనుక నారింజ రంగు షేడ్ ఇచ్చారు. చాతి పైన కుడివైపు నైకీ సింబల్, ఎడమవైపు బీసీసీఐ లోగో ఉంది. ప్రధాన స్పాన్సర్ ఒప్పో ఇండియా అని పెద్ద అక్షరాల్లో కనిపిస్తున్నది. పైగా తొలిసారి ఆ మూడు వరల్డ్ కప్ విజయాల (1983, 2007, 2011) తేదీలు, ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ చేసిన స్కోర్లు దానిపై ముద్రించారు. అంతే కాకుండా ఆ మూడు ఫైనల్స్ వేదికలు లార్డ్స్, వాండరర్స్, వాంఖడే మైదానాల అక్షాంశాలు–రేఖాంశాలు కూడా దీనిపై ముద్రించడం మరో విశేషం.
- Advertisement -
కొత్ జెర్సీలో తలుక్కు మన్న టీమిండియా ఆటగాళ్లు…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -