Friday, May 9, 2025
- Advertisement -

టీ20 లో ధోనీ కెరీర్ ముగిసిన‌ట్టేనా..? టెస్ట్‌ల్లో రోహిత్, పార్థివ్ పటేల్, కార్తీక్ రీఎంట్రీ

- Advertisement -

భారత సెలక్టర్లు శుక్రవారం రాత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్, ఆ తర్వాత సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. టీ20 జట్టులో ధోనీపై వేటు వేశారు. దీంతో దీంతో.. అతని అభిమానుల్లో కలవరం మొదలైంది. ఇక ధోనీ టీ20 కెరీర్ ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో బాధపడుతున్న మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికి ఈ పొట్టి ఫార్మాట్ నుంచి విశ్రాంతి కల్పించింది బోర్డు యాజమాన్యం. వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లోగా ధోనికి సరైన ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉన్న బీసీసీఐ… టీ20 సిరీస్‌లను ఆ పని కోసం ఎంచుకుంది. అదీగాక వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ధోనికి తగినంత విశ్రాంతి కల్పించే ఉద్దేశంతోనే ఈ సిరీస్‌లకి దూరంగా పెట్టినట్టు ఎమ్.ఎస్.కే ప్రసాద్ వివరించారు.

భారత్ జట్టు ఇప్పటి వరకు 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడితే.. ధోనీ ఏకంగా 93 మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్‌గా ఆడాడు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ని మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోనే భారత్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే.

మ‌రో వైపు ఆస్ట్రేలియా టూర్లో టెస్ట్ సిరీస్‌కు కూడా 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. కొన్నాళ్లుగా టెస్ట్‌ల్లో చోటు కోల్పోతూ వస్తున్న ఓపెనర్ రోహిత్ శర్మ, ఆసీస్ టూర్‌లో కీలకం కానున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో భారత జట్టు వైఫల్యం కారణంగా రోహిత్ జట్టులోకి రావడం అనివార్యమైంది. అదీగాక మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్, కోహ్లికి బ్యాటింగ్‌లో సపోర్ట్ ఇస్తాడని బోర్డు భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -