Saturday, May 3, 2025
- Advertisement -

పాకిస్థాన్‌కు వెళ్లే ప్రసక్తేలేదు:బీసీసీఐ

- Advertisement -

వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా టీమిండియా పాక్‌కు వెళ్తుందా లేదా అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది.

పాకిస్థాన్‌కు వెళ్లే ప్రసక్తేలేదని..టీమిండియా మ్యాచ్‌లను ప్రత్యామ్నాయ వేదికల్లో ఏర్పాటు చేయాలని ఐసీసీని కోరింది. దుబాయ్‌లో లేదా శ్రీలంకలో తమ మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీకి ప్రతిపాదించింది బీసీసీ.

అయితే ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు… ఐసీసీకి అందజేసింది. వన్డే వరల్డ్ కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. మార్చి 5, 6వ తేదీల్లో సెమీస్ జరగనుండగా మార్చి 9న ఫైనల్‌ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -