కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోగా తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. ఇవాళ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరనుండగా రేపు గాంధీ చేరిక ఉండనున్నట్లు తెలుస్తోంది. 2014,2018,2023లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రకాష్ గౌడ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
2009,2014,2018,2023లో ఎమ్మెల్యేగా గెలుపొందారు అరికెపూడి గాంధీ. రెండు సార్లు టీడీపీ నుండి, రెండు సార్లు బీఆర్ఎస్ నుండి గెలిచారు. వాస్తవానికి గాంధీని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రయత్నించారు. మనసు మార్చుకున్నట్లే కనిపించినా చివరకు కాంగ్రెస్‌లో చేరికకే మొగ్గుచూపారు గాంధీ. వీరిబాటలోనే మరికొంతమంది గ్రేటర్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
