బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్..ఆటగాళ్ల లిస్ట్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ జాతీయ జట్టు కోసం సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి చోటు దక్కించుకోగా తొలిసారిగా ఏడుగురు ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు. ఈ కాంట్రాక్ట్‌లు 2024 అక్టోబర్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయి.

మొత్తం 34 మంది ఆటగాళ్ల జాబితాలో వారిని నాలుగు గ్రేడ్లలో విభజించారు . A+, A, B, C జాబితాలుగా విభజించగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లు A+ జాబితాలో ఉన్నారు.

గ్రేడ్ Aలో రిషబ్‌ పంత్, మహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ , హార్దిక్ పాండ్యా ఉండగా ఈ జాబితాలో ఉన్న అశ్విన్‌ను విరమణ కారణంగా తొలగించారు.

శ్రేయస్ అయ్యర్, ఈసారి మళ్లీ కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు దక్కించుకొని B గ్రేడ్లోకి వెళ్లాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ కూడా ఇందులో ఉన్నారు.

C గ్రేడ్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. గత సీజన్‌లో ఈ విభాగంలో ఉన్న శివమ్ దూబే, జితేశ్ శర్మ, కేఎస్ భరత్, అవేశ్ ఖాన్ లను ఈసారి కాంట్రాక్ట్‌ జాబితా నుండి పూర్తిగా తొలగించారు. క్రిక్‌బజ్ నివేదికల ప్రకారం, నితిష్ రెడ్డి, అభిషేక్ శర్మ, హర్షిత్ రానా మొదలైనవారు కొత్తగా కాంట్రాక్ట్ పొందారు. ఈ విభాగంలో ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, ఆకాష్ దీప్ ఉన్నారు.

సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:

గ్రేడ్ A+ (4):
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ A (6 ):
రిషభ్ పంత్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా

గ్రేడ్ B (5):
సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్

గ్రేడ్ C (19 ):
రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పటీదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితిష్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా

కొత్తగా చేర్చబడినవారు (IN):
ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితిష్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, శ్రేయస్ అయ్యర్, ఆకాష్ దీప్

తొలగించినవారు (OUT):
షార్దూల్ ఠాకూర్, జితేశ్ శర్మ, కేఎస్ భరత్, అవేశ్ ఖాన్, విజయ్ కుమార్ వైషాక్, ఉమ్రాన్ మాలిక్, యష్ దయాల్, విద్వత్ కావేరప్ప