టీమిండియా టెస్టు కెప్టెన్‌గా నియమితులయ్యాడు శుభ్‌మన్ గిల్. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఇంగ్లండ్ టూర్‌కు భారత టెస్టు క్రికెట్ జట్టును ప్రకటించింది బీసీసీ.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. యువ ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్,నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసింది. ఒకే ఒక స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇచ్చింది.
తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్ 24 వరకు జరగనుండగా రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వరకు, మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వరకు, నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వరకు,ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగనుంది.
భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్‌కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
