Wednesday, May 7, 2025
- Advertisement -

ఐపీఎల్‌-12కు బూమ్రా, భువీ ఆడ‌టంపై ర‌విశాస్త్రి కీల‌క నిర్ణ‌యం….?

- Advertisement -

వ‌ర‌ల్డ్ క‌ప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా ఆట‌గాళ్ల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఆట‌గాళ్ల‌పై ఒత్తిడి లేకుండా చేసేందుకు త‌గు నిర్ణ‌యాలు తీసుకుంటోంది. జ‌ట్టుకు ప్ర‌ధాన బౌల‌ర్లు బూమ్రా, భువ‌నేశ్వ‌ర్‌. వీరిపై ఒత్తిడి లేకుండా చూసేందుకు టీమ్ కోచ్ ర‌విశాస్త్రి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

త్వ‌ర‌లో జ‌రిగే ఐపీఎల్ సీజ‌న్ 12 కు ప్ర‌ధాన పేస‌ర్లు బూమ్రా, భూవ నేశ్వ‌ర్ దూరంకానున్నట్లు తెలుస్తోంది.మార్చి 23న ప్రారంభంకానున్న ఐపీఎల్ టోర్నీ.. మే మూడో వారం వరకూ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ళ చేసేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించింది బీసీసీఐ. అయితే టీం ఇండియా ప్రధాన బౌలర్లలను ఈ ఐపీఎల్‌ సీజన్ నుంచి దూరం పెట్టాలని అనుకుంటున్నట్లు ఆయన జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ ర‌వి శాస్త్రి తెలిపారు. మే నెల ఆఖరి వారంలో ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది.

ప్ర‌స్తుతం ఇండియా న్యూజిలాండ్ పర్యటన‌లో ఉంది. అక్క‌డ నుంచి భారత్ తిరిగి వచ్చాక.. భారత్ మళ్లీ ఆస్ట్రేలియాతో స్వదేశంలో తలపడనుంది. అయితే ప్రపంచకప్‌కి ముందు జరిగే ఈ లీగ్‌లో పాల్గొని ఆటగాళ్లు గాయాలపాలు అయితే.. ప్రపంచకప్‌లో జట్టు ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరిపి.. కొందరు ఆటగాళ్లను ఐపీఎల్‌లో కొన్ని మ్యాచుల్లోనే పాల్గొనేలా ఒప్పించేందుకు శాస్త్రి చర్యలు మొదలుపెట్టారు.

విదేశాల్లో అదుబ్భుతంగా రాణిస్తున్న పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలు ప్రపంచకప్‌కి కీలకంగా భావిస్తున్నారు. ఐపీఎల్ భారత ఆటగాళ్లు ఫాం కోల్పోకుండా.. కొన్ని మ్యాచుల్లోనే పాల్గొనేలా మేం ఫ్రాంచైజీలు, కెప్టెన్ల ఒప్పించే ప్రయత్నం చేస్తామని ర‌వి శాస్త్రి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -