Monday, May 12, 2025
- Advertisement -

పాక్‌తో క్రికెట్ ఆడితే త‌ప్పేంటి….? మాజీ దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌…

- Advertisement -

గ‌త కొన్నేళ్లుగా భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే ఐసీసీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఇరు దేశాల మ‌ధ్య మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌లేక‌పోతోంది. ఉగ్ర‌వాదం కార‌నంగానే రెండు దేశాల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్‌లు జ‌గ‌ర‌డంలేదు. దీన్ని భార‌త దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ తప్పుబట్టారు.

రాజకీయ కారణంగానే ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు తెగిపోయాయని విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక క‍్రీడను క్రీడగానే చూడాలే కానీ, ఇక్కడ రాజకీయాలతో కలుషితం చేయడం ఎంతమాత్రం సరికాదన్నాడు. అసలు పాకిస్తాన్‌ తో క్రికెట్‌ ఆడకుండా ఉంటే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చనే ప్రభుత్వ నిర్ణయాన్ని బేడీ పరోక్షంగా తప్పుపట్టాడు.

క్రికెట్‌లో రాజకీయాలేమిటి.. పాకిస్తాన్‌ తో క్రికెట్‌ ఆడకుండా ఉంటే ఉగ్రవాదం కంట్రోల్‌ అయిపోతుందాని ప్ర‌శ్నించారు.ఇరు దేశాల మధ్య సఖ్యత వాతావారణం నెలకొనాలంటే క్రికెట్‌ అనే దాన్ని ఒక ప్లాట్‌ఫామ్ గా ఉపయోగించుకోవాలి‌. అంతేకానీ పాకిస్తాన్‌తో క్రికెట్‌ ఆడకపోతేనే దేశభక్తి ఉందనుకోవడం పొరపాట‌న్నారు. ఇది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మేగాని భారతదేశానికి నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు’ అని బిషన్‌ సింగ్‌ బేడీ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -