ఐపీఎల్ తాజా సీజన్‌లో ధోని సారథ్యంలోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాంటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై జట్టు మరో రెండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
సురేశ్ రైనా(58) ఈ సీజన్‌లో మొదటిసారి రాణించాడు. చివర్లో రవీంద్ర జడేజా(31) అద్భుతంగా ఆడి తమ జట్టుకు విజయాన్ని అందించాడు.ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది ధోని జట్టు. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనే సీఎస్‌కేదే పైచేయి అయ్యింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- Advertisement -
వరుస విజయాలతో దూసుకుపోతున్న చైన్నై సూపర్ కింగ్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -