Monday, April 29, 2024
- Advertisement -

ధోని సేన‌ను అడ్డుకోవ‌డం స‌న్‌రైజ‌ర్స్ వ‌ల్ల అవుతుందా…?

- Advertisement -

ఈ రోజు(బుధ‌వారం) హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు, చైన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో ధోని సార‌థ్యంలోని చైన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు వ‌రుస విజ‌యాలతో దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ప‌రాజ‌యం పాలైంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక అగ్ర‌స్థానంలో కొనసాగుతోంది. ఇక హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే ఐపీఎల్ స్టార్టింగ్‌లో వ‌రుస విజ‌యాల‌ను సాధించి మంచి ఊపు మీద క‌నిపించింది. అయితే స‌డ‌న్‌గా వ‌రుస ప‌రాజ‌యాల‌తో రేస్‌లో బాగా వెన‌క‌ప‌డింది.

ఈ సీజ‌న్‌లో చైన్నై సూప‌ర్ కింగ్స్ ఆడిన మ్యాచ్‌లో కూడా స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోయింది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి విజ‌యాల బాట ప‌ట్టల‌ని చూస్తుంది స‌న్‌రైజ‌ర్స్. చైన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే రాయుడు, వాట్సాన్‌, ధోని ఇలా అంద‌రు ఫామ్‌లోనే ఉన్నారు. స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్ బ‌లం అంత ఓపెన‌ర్స్ మీద‌నే ఉంది. రెండు జ‌ట్ల‌లోను బౌలింగ్ బాగానే ఉంది. మ‌రి ఈ మ్యాచ్‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి. ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్ సాయంత్రం 8 గంట‌ల‌కు మొదలుకానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -