ఐపీఎల్ తాజా సీజన్‌లో ధోని నాయకత్వంలోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ధోని ( 75) రైనా (36) మెరుగ్గా రాణించారు. 120 పరుగులు కూడా చేయడం కష్టం అని భావించిన జట్టుకు ధోని మెరుపు బ్యాటింగ్‌తో తమ జట్టు భారీ స్కోరు సాధించేలా చేశాడు.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టు ఆదిలోనే వికెట్లను కోల్పొయి కష్టాల్లో పడింది. స్టోక్స్ ( 46), రాహుల్ త్రిపాఠి (39) రాణించి విజయంపై ఆశలు రేపారు. కాని చివర్లో చైన్నై బౌలర్లు రాణించడంతో 8 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది చైన్నై జట్టు. వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది ధోని జట్టు. మ్యా న్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ధోనికి దక్కింది.
- Advertisement -
ధోని మెరుపు బ్యాటింగ్..రాజస్తాన్ రాయల్స్‌పై చైన్నై సూపర్ విక్టరీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -