Thursday, May 8, 2025
- Advertisement -

బౌల‌ర్ల‌కి నిద్ర‌లేకుండా చేస్తున్న ముంబ‌య్ హిట్ట‌ర్‌….

- Advertisement -

హెలికాప్టర్‌ షాట్‌.. అనగానే ఠక్కున గుర్తొచ్చే మహేంద్రసింగ్‌ ధోనీ. తనదైన స్టైల్‌లో ధోని హెలికాప్టర్‌ షాట్‌ ఆడితే.. అభిమానుల ఆనందానికి అవ‌ధులుండ‌వు. అలాంటి షాట్‌తో బౌల‌ర్ల‌కి నిద్రలేకుండా చేస్తున్నాడు ముంబ‌య్ ఆల్ రౌండ‌ర్ హార్థిక్ పాండ్యా. క్రిస్‌గేల్, ఆండ్రీ రసెల్, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్‌ తదితర హిట్టర్ల కంటే.. ఇప్పుడు అన్ని జట్లూ ముంబయి టీమ్ పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్యాని స్లాగ్ ఓవర్లలో నిల్వ‌రించ‌డం క‌ష్టంగా మారింది.

ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌కి వస్తున్న హార్దిక్ పాండ్యా బంతి ఏదైనా.. బౌలర్ ఎవరైనా ఉతికి ఆరేస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో హెలికాప్టర్‌ షాట్‌తో పాండ్యా సిక్సర్‌గా మలిచాడు. రబడా వేసిన చివరి ఓవర్‌లో మణికట్టు మాయాజాలంతో బంతిని అమాంతం గాల్లోకి లేపి సిక్సర్‌గా మలిచాడు.

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 15.1 ఓవర్లు ముగిసే సమయానికి 104/4తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివరి 4 ఓవర్లలో ఉతికారేసిన హార్దిక్ పాండ్య (32: 15 బంతుల్లో 2×4, 3×6) ఆఖరికి ముంబయిని 168/5తో మెరుగైన స్థితిలో నిలిపాడు.

లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తడబడటంతో ఈ మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ముంబై విజయ ఢంకా మోగించింది. ముంబై నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది. ముంబై యువ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌(3/19), బుమ్రా(2/18) ధాటికి ఢిల్లీ విలవిల్లాడింది.

https://twitter.com/shubhangi23_/status/1118918007999406080

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -