Saturday, April 27, 2024
- Advertisement -

ధోని కొత్త లుక్ అదిరిందిగా…!

- Advertisement -

ఎం.ఎస్ ధోని ఈ పేరు ఇండియ‌న్ క్రికెట్‌లో సంచ‌ల‌న‌మే అని చెప్పాలి.ధోని కెప్టెన్‌గా ఎన్నో రికార్డుల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు ప్ర‌పంచ క‌ప్‌ల‌ను ఇండియాకు అందించాడు ధోని.అయితే ధోని రిటైర్మెంట్‌పై గ‌త కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్త‌ల‌ను ఏం ప‌ట్టించుకోని ధోని త‌న ప‌ని తాను చేసుకుంటుపోతున్నాడు.

ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో తెల్లటి గడ్డంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తాజాగా కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడు. ధోని ఎప్పుడూ కొత్త కొత్త స్టైల్స్‌తో అభిమానులను కనువిందు చేస్తూ ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తుంటాడు. ప్రస్తుతం ధోని చేయించుకున్న ఈ కొత్త హెయిర్‌ స్టైల్‌ పేరేంటంటే.. ‘వీ హాక్‌’. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -