సెలబ్రిటీలకు అభిమానులతో సెల్ఫీలు దిగడమన్నా, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడమన్నా కాస్త ఇబ్బందే. కానీ టీమిండియా సారథి విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు భిన్నం. మైదానంలోనే కాకుండా, బయటకూడా అభిమానులను ఉత్తేజపరచటానికి కోహ్లి ఎప్పుడూ ముందుంటాడు.
తాజాగా వందలాది మంది మధ్యలో ఓ చిన్ని అభిమాని పిలుపును విన్న కోహ్లీ అతని దగ్గరకు వెళ్లాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అ అభిమాని ఎవరో కాదు..ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్‌కు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చి కోహ్లి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.
ట్రెండ్ బ్రిడ్జ్ లో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన టెస్టులో విజయం అనంతరం విరాట్ స్టేడియం బయట అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇస్తూ ముందుకు సాగాడు. అంతమందిలోనూ ఓ చిరు అభిమాని విరాట్ ను చూసేందుకు దూసుకొచ్చాడు. అక్కడే నిలబడి ‘విరాట్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ అర్థించాడు. దీంతో ఆ పిల్లాడిని చూసిన కోహ్లీ.. అతని దగ్గరకు వెళ్లాడు. స్మార్ట్ ఫోన్ తీసుకుని అతడితో సెల్ఫీ దిగాడు. అంతేకాకుండా ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు.
ఏకంగా విరాట్ తో సెల్ఫీ దిగి ఆటోగ్రాఫ్ తీసుకోవడంతో ఆ పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఐసీసీ టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో విరాట్ ఇటీవల ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సాధించిన సంగతి తెలిసిందే.
#WATCH: Indian cricket team Captain Virat Kohli takes a selfie with a child after he was continuously requesting "Virat, a picture please" outside Trent Bridge cricket stadium in England's Nottingham. #INDvsENG pic.twitter.com/ngKsEVXjwd
— ANI (@ANI) August 22, 2018