హెచ్ సీఏ అధ్యక్షు రేసులో వివేక్ కు బిగ్ షాక్…..

హెచ్‌సీఏ అధ్యక్షుపదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధ్యపదవికోసం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తో పాటు మాజీ అధ్యక్షుడు వివేక్ కూడా పోటీ పడుతున్నారు.అధ్యక్ష పదవి కోసం ఆయన వేసిన నామినేషన్ తిర్స్కరణకు గురవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూ క్రికెట్ అభివృద్ధికి కృషి చేసిన తన నామినేషన్‌ను తిరస్కరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

క్రమశిక్షణా కమిటీ విచారణలో తాను ఫిక్సింగ్‌ చేసినట్లు స్వయంగా అజహరుద్దీన్‌ ఒప్పుకున్నారు. అయినా అతని నామినేషన్‌ స్వీకరించారని మండిపడ్డారు. బీసీసీఐ నుంచి నిధులు రాకున్నా సొంత ఖర్చుతో టి20 లీగ్‌ నిర్వహించా. నాపై తప్పుడు రిపోర్టులు సృష్టించి హెచ్‌సీఏకు దూరం చేశారు’ అని ధ్వజమెత్తారు.రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే చక్రం తిప్పుతోన్న కల్వకుంట్ల కుటుంబం క్రీడల్లోను కూడా చక్రం తిప్పాలని చూస్తోందని మండిపడ్డారు.