ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్య ఎన్నికల్లో అజారుద్దీన్ ఘనవిజయం సాధించారు. 148 ఓట్ల తేడాతో ప్రత్యర్ధిపై గెలుపొందారు.ఈ ఎన్నికల్లో 227 ఓట్లకు గాను, 224 మంది సభ్యులు ఓటేశారు. కొద్ది సేపటి క్రితం ఎన్నికల సంఘం అధికారులు అజహర్ ఎన్నికను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ బరిలోకి దిగినప్పటికి ప్రధానంగా అజహర్ మరియు ప్రకాశ్ చంద్ జైన్ ప్యానెల్ల మధ్యనే పోటీ నెలకొంది. ఆసక్తికరంగా సాగిన ఎన్నికల్లో అజహరుద్దీన్నే విజయం వరించింది.
హెచ్‌సీఏ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.155 ప్రైవేట్ క్లబ్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు 51 ఆయా సంస్థల క్లబ్‌లు, తొమ్మిది జిల్లా క్రికెట్ సంఘాలు, 11 మంది మాజీ క్రికెటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
