Sunday, May 4, 2025
- Advertisement -

సెహ్వాగ్ తో పోలిస్తే అతడు గొప్పోడే.. కానీ బుర్ర లేదు : షోయబ్ అఖ్తర్

- Advertisement -

పాక్ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ పట్ల ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ కామెంట్స్ చేశారు. భారత బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కంటే.. తన కంటే ఇమ్రాన్ నజీర్ చాలా ప్రతిభావంతుడని.. కాకపోతే అతనికి బుర్రలేదని చెప్పాడు. పాక్ క్రికెట్ వ్యవస్థ కూడా అతని ప్రతిభను గుర్తించలేదని అన్నారు.

సెహ్వాగ్ కు ఉన్న మెదడు నజీర్ కు ఉందని తాను అనుకోవడం లేదని… అదే విధంగా నజీర్ కు ఉన్న ప్రతిభ సెహ్వాగ్ కు ఉందని భావించడం లేదని ఓ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ అన్నారు. ఒక మ్యాచ్ లో భారత్ పై ఇమ్రాన్ అద్భుతమైన సెంచరీ చేశాడని.. నిలకడగా ఆడాలని తాను సూచించానని.. కానీ, తన మాటను అతను పట్టించుకోవలేదని తెలిపాడు.

సెహ్వాగ్ కంటే గొప్ప ఆటగాడు నజీర్ లో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అతన్ని పాక్ క్రికెట్ బోర్దు సరిగా ఉపయోగించుకోలేదని విమర్శించాడు. ఇమ్రాన్ నజీర్ పాక్ తరపున 8 టెస్టులు మాత్రమే ఆడి 427 పరుగులు చేశాడు. 79 వన్డేల్లో 1,895 రన్స్ సాధించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -