Monday, April 29, 2024
- Advertisement -

పాక్ పీఎమ్ ఇమ్రాన్ ఖాన్ పై సెటైర్స్ వేసిన మాజీ క్రికెటర్స్ సేహ్వాగ్, గంగూలి…

- Advertisement -

ఐరాసాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన విద్వుస ప్రసంగంపై భారత్ మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, గంగూలిలు ట్విట్టర్ వేదికగా అదిరిపోయె సెటైర్లు వేశారు. కశ్మీర్‌ అంశంపై ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రపంచం ముందు ఒంటరిగా మిగిలిన ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా మరిన్ని అవమానాల కోసం సరికొత్త దారులు వెదుక్కుంటున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.

గత నెల 26న ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఇమ్రాన్‌ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 జీవో రద్దు గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు అణ్వస్త్ర యుద్ధానికి దిగితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు.తనను కించపరుచుకునేందుకు కొత్త మార్గాలు కనిపెట్టారంటూ ఇమ్రాన్‌ఖాన్‌పై ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇమ్రాన్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేసి సెటైర్‌ వేశాడు.

ఆ తర్వాత అమెరికా చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్‌ ప్రసంగాన్ని ఎందుకూ కొరగాని రాద్ధాంతం అన్నట్లు మాట్లాడిన అమెరికా చానెల్‌ యాంకర్‌ వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సెహ్వాగ్‌ ప్రస్తావించారు. సెహ్వాగ్ జాబితాలో మాజీ కెప్టెన్ గంగూలి కూడా చేరారు. వీరూ.. ఆ వీడియోను చూసి షాక్‌ గురయ్యాను. అది వినకూడని ప్రసంగం. ప్రపంచం మొత్తం శాంతిని కోరుకుంటుంటే పాకిస్తాన్‌కు అందుకు భిన్నంగా స్పందించింది. అసలు శాంతి అనేది పాకిస్తాన్‌కు చాలా అవసరం. ఆ దేశానికి ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఇలా మాట్లాడతారనుకోలేదు. అదొక చెత్త స్పీచ్‌ అంటూ కొట్టిపడేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -