Saturday, May 3, 2025
- Advertisement -

IND vs BAN: టీ20 జట్టు ఇదే

- Advertisement -

బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహారించనుండగా 15 మందితో టీంను ప్రకటించింది బీసీసీఐ.

సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్య ఇద్దరు మాత్రమే సీనియర్లు కాగా యువ పేసర్ మయాంక్ యాదవ్ టీ20 పార్మాట్ లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.

ఐపీఎల్ లో సత్తాచాటిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణాలు ,స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి,సంజూ శాంసన్, జితేశ్ శర్మలకు అవకాశం కల్పించారు. బంగ్లాదేశ్ జట్టుతో భారత్ మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుండగా మొదటి అక్టోబర్ 6న, రెండో మ్యాచ్ 9న, మూడో మ్యాచ్ 12వ తేదీన జరుగుతుంది.

భారత్ జట్టు:

సూర్యకు మార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, ఆర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -