Saturday, May 10, 2025
- Advertisement -

భార‌త్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్లా ర్క్‌…

- Advertisement -

ప్రపంచకప్‌ సెమీస్‌ తొలి సమరానికి అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మాంచెస్టర్‌ వేదికగా భారత్‌ X న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. వ‌ర‌ణుడు క‌రునిస్తే మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్‌పై ఆసిస్ మాజీ కెప్టెన్ క్లార్క్ అస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీమిండియా ఫైన‌ల్ చేరింద‌ని….తమ ఆటగాళ్లే కష్టపడాలని అభిప్రాయ ప‌డ్డారు.

టీమిండియా ఇప్పటికే ఫైనల్స్‌ కోసం ఒక అడుగు ముందుకేసిందని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంటే.. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కివీస్‌ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించిందని వ్యాఖ్యానించాడు.

దూకుడు మీదున్న కోహ్లిసేనను న్యూజిలాండ్‌ అడ్డుకోలేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల ఫామే ఆ జట్టును హాట్‌ ఫేవరేట్‌గా చేసిందని చెప్పుకొచ్చాడు. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగే తొలి సెమీస్‌లో భారతే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు. భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌లో ఎవరూ ఇలా ఖచ్చితంగా చెప్పరు. భారత ఆటగాడినైతే నేను కూడా ఇలా ఆలోచించను. కానీ భారత్‌ ఫామ్‌ చూస్తుంటే ఆ జట్టు కసి తెలుస్తోంది. నమ్మశక్యం కానీ ప్రదర్శనను వారు కనబరుస్తున్నారంటూ అస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -