మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి ఓవర్‌లోనె కోహ్లీ తప్పిదం కారణంగా టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. తొలి ఓవర్‌ను భువనేశ్వర్ చేతికి అందించాడు. తొలి బంతికే భువనేశ్వర్ కుమార్ వికెట్ సాధించినంత పని చేశాడు. భువీ వేసిన తొలి ఓవర్ మొదట బంతిని గుడ్ లెంగ్త్‌లో సంధించాడు. ఇది కాస్తా గప్టిల్ బ్యాట్‌ను దాటుకుని ప్యాడ్లకు తాకింది. దాన్ని అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో భారత్ రివ్యూ కోరగా…డీఆర్‌ఎస్‌లో అది నాటౌట్ అని తేలింది. దీంతో భారత్ తన ఒక్క రివ్యూను కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్ కాగా, బుమ్రా వేసిన రెండో ఓవర్ సైతం మెయిడిన్ కావడం విశేషం. కాగా, మూడో ఓవర్‌లో కివీస్ ఖాతా తెరవగా, బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో గప్టిల్ పెవిలియన్ చేరాడు. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. 14 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే తీశాడు.
- Advertisement -
తొలి బంతికే టీమిండియాకు బిగ్ షాక్..తప్పును సరిదిద్దుకున్న కోహ్లీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -