ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను రిలీజ్ చేసింది. బౌలర్ల విభాగంలో బుమ్రా టాప్ ప్లేస్‌లో నిలవగా బ్యాటింగ్ విభాగంలో టాప్ 10లో కేవలం ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
బ్యాటింగ్ విభాగంలో జోరూట్ (ఇంగ్లాండ్) – 895 రేటింగ్ పాయింట్లుతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 876 రేటింగ్ పాయింట్లు,
కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 867 రేటింగ్ పాయింట్లు,యశస్వి జైస్వాల్ (భారత్) – 847 రేటింగ్ పాయింట్లు,ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 772 రేటింగ్ పాయింట్లతో టాప్ 5లో ఉన్నారు.
బౌలింగ్ విభాగంలో బుమ్రా (భారత్) – 908 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో ఉండగా పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 841 రేటింగ్ పాయింట్లు,రబాడ (దక్షిణాఫ్రికా) – 837 రేటింగ్ పాయింట్లు,జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 835 రేటింగ్ పాయింట్లు, మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) – 785 రేటింగ్ పాయింట్లుతో టాప్ -5లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా (భారత్) – 400 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1గా, మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) – 294 రేటింగ్ పాయింట్లు,మెహదీ హసన్ (బంగ్లాదేశ్) – 284 రేటింగ్ పాయింట్లు,పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 282 రేటింగ్ పాయింట్లు,షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 263 రేటింగ్ పాయింట్లతో టాప్ 5లో నిలిచారు.
